ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది కరోనా వైరస్. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ యూరప్ మరియు అగ్రరాజ్యం అమెరికాలో పడగ విప్పిన పాముల విలయతాండవం చేస్తోంది. అమెరికా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు కావడంతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ వైరస్ ని అరికట్టడానికి అమెరికా శాస్త్రవేత్తలు మరియు ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న కొద్దీ వైరస్ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో చనిపోయే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఈ వైరస్ ప్రభావం రానున్న రోజుల్లో ఏ మేరకు ఉంటుందో అన్న దానిపై కొత్త సర్వే ఇటీవల 'ద లాన్సెట్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్' అనే సంస్థ చేసింది.

 

ఈ సర్వేలో లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ సహా వివిధ సంస్థలకు చెందిన పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సర్వే యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే కరోనా వైరస్ వల్ల నమోదవుతున్న పాజిటివ్ మరియు మరణాల రేటు రాబోయే రోజుల్లో ఈ మేరకు సంభవిస్తుందని తాజా పరిణామాలను బట్టి సర్వే చేయడం జరిగింది.

 

సర్వేలో వచ్చిన ఫలితాలు చూస్తే ప్రపంచంలో 50 నుంచి 80 శాతం మంది ఈ వైరస్ బారిన పడవచ్చని ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య కూడా అధికం గానే ఉంటుందని కొత్త నిజాలు చెప్పుకొచ్చింది. అంటే దాదాపు ప్రపంచం మొత్తం రాబోయే రోజుల్లో వైద్యరంగం పై ఆధారపడి బోతున్నట్లు తెలిపింది. వైరస్ లక్షణాలను గుర్తించడం మరణానికి మధ్య ఉన్న రోజులు 17.8 కాగా వ్యాధి నుంచి కోలుకునేందుకు పట్టేది 22.6 రోజులని ఈ సర్వేలో తేలింది. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: