కరోనా మహమ్మారి వెంటాడి.. వేటాడి చంపుతున్న వేళా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యకరంగాను.. మహిళలను అవమానించినట్టు ఉంది. అయితే అదృష్టవశాత్తు ఈ నిర్ణయాలు.. టిప్స్ మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు.. మలేషియా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

 

అసలు ఎం జరిగింది అంటే? కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మలేషియా మర్చి నెల 18వ తేదీ నుండి లాక్ డౌన్ విధించింది. దీంతో ఎక్కడికి అక్కడ లాక్ డౌన్ అయిపోయింది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యి కొందరు రెస్ట్ తీసుకుంటుండగా.. కొందరు మాత్రం దారుణంగా గొడవలు పడుతున్నారు. 

 

దీంతో మలేషియా ప్రభుత్వం.. ఇంటి పని, వంట పని చెయ్యాలి అని భర్తలను ఇబ్బంది పెట్టకూడదు అని మలేషియా ప్రభుత్వం ఓ ట్విట్ చేసింది.. ఆ తర్వాత మహిళలు ఇంట్లో కూడా అందంగా మేకప్ వేసుకోవాలి అని.. ఆఫీస్ కు వెళ్లిన సమయంలో మేకప్ ఎలా వేసుకుంటారో ఇంట్లో కూడా అలానే వేసుకోవాలి అని.. కొత్త కొత్త బట్టలు ధరించాలి అని మరో పోస్ట్ చేసింది. 

 

దీంతో ఒక్క ఆ దేశం మహిళలే కాకుండా మిగితా అందరూ కూడా ఈ విషయంపై ఫైర్ అవుతున్నారు. మహిళలు మీకు ఎలా కనిపిస్తున్నారు అని.. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు అని వారు ఫైర్ అవుతున్నారు. దీంతో మలేషియా ప్రభుత్వం ఆ పోస్ట్ ను కూడా డిలీట్ చేసింది. అంతేకాదు.. మహిళల ఆగ్రహాన్ని తట్టుకోలేని ప్రభుత్వం దిగివచ్చి క్షమాపణలు చెప్పింది. కాగా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో ఇలాంటి సూచనలు చెయ్యడం అవసరమా అంటూ నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: