కరోనా వైరస్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ప్రభావం ఇప్పటికీ జనాలంతా చవిచూస్తున్నారు. రానున్న రోజుల్లో చవి చూడబోతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ అన్నివిధాలుగా తీవ్రంగా నష్టపోగా భారీగా ప్రాణ నష్టం కూడా చోటు చేసుకున్నాయి. ఈ వైరస్ ను అరికట్టేందుకు మందులను కనిపెట్టే పనిలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. అయితే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ద్వారానే ఈ కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అన్ని దేశాలు నమ్ముతున్నాయి.ఇప్పటి వరకు అంతా కరోనా ప్రభావం తో జరుగుతున్న నష్టాన్ని గురించి మాత్రమే మాట్లాడుకున్నారు. అయితే నాణానికి మరో వైపు చూస్తే కరోనా వల్ల మంచే జరిగిందని వాదించేవారు లేకపోలేదు. లాక్ డౌన్ నిబంధన కారణంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రజలంతా కే పరిమితం అయిపోవడంతో ఇప్పటి వరకు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన వారంతా ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే తమ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకుంటూ అవగాహన పెంచుకుంటున్నారు. 

 

IHG


కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి ఉండడంతో అంత ప్రశాంతంగా కుటుంబానికి సంబంధించి అన్ని విషయాలను చర్చించుకుంటున్నారు. సరైన సమయానికి భోజనం తీసుకుంటూ, సమయానికి నిద్రపోతూ పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు. 10% అత్యవసర విధుల్లో ఉన్న వారు తప్పిస్తే మిగతా 90 శాతం మంది పూర్తిగా ఇళ్ల కే పరిమితం అయ్యారు. ఇంటి పనులు కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకుంటూ ఒకరి కష్టం ఒకరు పంచుకుంటూ ఆప్యాయతలు అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. మరి కొంతమంది ఆన్లైన్ ద్వారా తమకు నచ్చిన కోర్సులు నేర్చుకుంటూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ... నైపుణ్యం పెంచుకుంటున్నారు.

 


 ఇక ఢిల్లీ వంటి నగరాల గురించి చెప్పుకుంటే మొన్నటి వరకు అక్కడ విపరీతమైన కాలుష్యం ఉండేది. కానీ లాక్ డౌన్ కారణంగా మొత్తం కాలుష్యం అంతా అదుపులోకి వచ్చేసింది. పరిశ్రమలన్నీ మూతపడడంతో గాలి కాలుష్యం దాదాపు తగ్గిపోవడంతో ఢిల్లీవాసులు అంతా ఆనందంగా ఉన్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే రకమైన అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: