ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించిన విషయాలు రోజుకి ఒక్కొక్కటిగా కొత్తగా బయట పడుతుంటే.... ప్రజలంతా క్షణక్షణం భయంతో కాలం గడుపుతున్నారు. ప్రపంచంలో దాదాపు అన్నీ దేశాలు లాక్ డౌన్ ను పటిష్టంగా పాటిస్తున్నాయి. ఇప్పటివరకు వైరస్ సోకిన వారు చనిపోవడం లేదా సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడడం తప్పించి కరోనా వైరస్ ను అంతం చేసేందుకు అయితే ఏ మందు తయారు కాలేదు కానీ ఇప్పుడు అందరికీ భారీ ఊరటను ఇస్తున్న ఈ వార్త ఏమిటంటే కరోనా కు వ్యాక్సిన్ ను శాస్త్రవేత్తలు కనిపెట్టారట. కరోనా భరతం పట్టేందుకు ఒక వ్యాక్సిన్ అడుగుపెట్టబోతోంది.

 

అయితే ఈ కీలక వార్తను వినిపించిన శాస్త్రవేత్తలు ఎవరంటే అగ్రరాజ్యం అమెరికాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జాకబ్ గ్లాస్ విల్లే. కరుణ వైరస్ బాధితులను రక్షించేందుకు కాలిఫోర్నియాకు చెందిన ఈ డాక్టర్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. సార్స వైరస్ ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన యాంటీ బాడీస్ నే ఉపయోగించిన తమ బృందం కరోనా వైరస్ పై పూర్తిగా విజయం సాధించిందని డిస్ట్రిబ్యూటెడ్ బయో ల్యాబ్ కు సీఈఓ అయిన జాకబ్ చెప్పారు.

 

ఐదుగురు ఉన్న తన బృందం కరోనా వైరస్ పై చాలా లోతుగా పరీక్షలు నిర్వహించి దానిని అంతం చేసేందుకు ఐదు ఏంటి బాడీలను తీసుకోగా వారి ప్రయోగం ఫలించిందని అతను వివరించాడు. తాము కనిపెట్టిన మందును మనుషులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొన్న తర్వాత అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. అంతా అనుకున్నట్టు జరిగితే... సెప్టెంబర్ నెలలో తమ మందు అందుబాటులోకి రావచ్చని ఆయన చెప్పారు.

 

ఆ దిశగా ప్రయత్నాలను తాము ముమ్మరం చేశామని... మరో రెండు లాబొరేటరీల సాయంతో తాము చేసిన ప్రయోగ ఫలితాలను నిర్ధారించుకుంటున్నామని కూడా జాకబ్  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: