కరోనా కట్టడి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమవుతుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వాలంటీర్లు జలుబు జ్వరం తో ఉన్న వాళ్ళను గుర్తించారని ఆ సమాచారం తమ వద్ద ఉందని విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

 

ఇప్పుడు ఆ సమాచారం వాళ్ళ వద్ద ఉన్నా ఏపీలో కరోనా వైరస్ ని ఎందుకు కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే ప్రశ్న వినపడుతుంది. కరోనా వైరస్ విషయంలో ఏపీ సర్కార్ ముందు నుంచి అలసత్వం ప్రదర్శిస్తూనే ఉంది. మంత్రులు కొందరు మాట్లాడే మాటలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడే మాటలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు వేదికగా మారాయి. కరోన ప్రభావం వారికి అర్ధం కావడం లేదు.

 

నిన్న కూడా జగన్ దాన్ని ఒక సాధారణ రోగంగా మాట్లాడారు గాని దాని తీవ్రతను ఆయన ప్రజలకు వివరించడంలో ఘోరంగా విఫలమయ్యారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ ని లైట్ తీసుకున్న దేశాలు అన్నీ ఇప్పుడు సర్వ నాశనం అయ్యాయి. ఏపీలో తెలంగాణా కంటే కరోనా వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడి ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడటం ఖాయం... వాటిని అంచనా వేయడం దాదాపుగా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: