కరోనా వైరస్ విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న విధానాలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే దేశం ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం అక్కడి అమెరికన్లను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచం మొత్తం నానా సంకలూ నాకుతుంటే ట్రంప్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు గా ఉన్నాడని అక్కడి అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. 

 

ట్రంప్ అసలు అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని పలువురు సూచిస్తున్నారు. కొంత మంది నుంచి అది డిమాండ్ కూడా. ట్రంప్ ఇప్పటికీ లాక్ డౌన్ ప్రకటించడం లేదు. చైనా లాక్ డౌన్ ఒక్క నగరానికే అమలు చేసింది నేను మాత్రం అలా చేసేది లేదని ఆయన పట్టుదలగా ఉన్నాడు. జనం అందరూ స్వేచ్చగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి అమెరికాలో ఉంది. కరోనా కట్టడి విషయంలో ఈ ప్రవర్తన చికాకుగా మారింది. 

 

కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో ట్రంప్ మాత్రం దూకుడుగా నిర్ణయాలు తీసుకోకపోతే అమెరికా ఒక చరిత్ర అంటూ పలువురు ఇప్పుడు ఆ దేశాన్ని ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేస్తున్నారు. ట్రంప్ ఇంకా మొండి పట్టుకి పోతే మాత్రం అది మరింత తీవ్రమై అమెరికా నాశనం అవ్వడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తప్పుకుని మరొకరికి బాధ్యతలు అప్పగిస్తే అమెరికా ఈ విపత్తు నుంచి బయటపడుతుంది అని సూచిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: