ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పెను విపత్తు ఎక్కడివరకు వెళ్తుందో ..? ఎంతమందిని బలి తీసుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అన్ని దేశాలు కరోనా వైరస్ ధాటికి విలవిలలాడుతూ ఆందోళనలో ఉన్నాయి. ఈ వైరస్ ఎంత తొందరగా అంతమొందుతుందో తెలియక సతమతం అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్ర రాజ్యాలు సైతం ఈ వైరస్ కారణంగా విలవిల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే కరోనా కారణంగా అగ్ర రాజ్యం అమెరికా కూడా పరిస్థితిని అదుపు చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. కరోనా వైరస్ ను  కట్టడి చేసే విషయంలో అమెరికా  ఘోరంగా విఫలమయింది. కరోనా వైరస్ మహమ్మారి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్అనడమే కాకుండా తమది జీవన్మరణ సమస్యగా ట్రంప్ చెప్పారంటే అమెరికాలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

IHG

అసలు ఇప్పటికే  అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష కు పైగా నమోదయ్యాయి. వచ్చే రెండు వారాలు అమెరికాకు అత్యంత కీలకమంటూ స్వయంగా వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి అంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రధానంగా అమెరికా లోని న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ప్రాంతాలు కరోనా వైరస్ తాకిడికి ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. ఇక్కడ భవనాలు పక్క పక్కనే ఉండటం, లిఫ్ట్ ల వాడకం వంటి కారణంగా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు. దాదాపు రెెండు లక్షల మంది అమెరికాలో కరోనా వైరస్ వల్ల మరణించే అవకాశం ఉన్నట్టుగా అధికారులు ప్రకటిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇప్పటికే నౌకలు, స్టేడియాలను, పార్కులను ఆసుపత్రులుగా మారుస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 3900కు చేరుకోవడం అందరిని ఆందోళనకు గురి చేసే అంశమే. ప్రభుత్వం సూచనలు ఖచ్చితంగా పాటించాలని ట్రంప్ స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని వేడుకుంటున్నారు. కరోనా వ్యాప్తికి ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ విధిస్తే ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి ఆ ప్రభావం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కనిపిస్తుందనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ విధంగా వ్యవహరించడం ఇప్పుడు అమెరికాకే ముప్పు తీసుకొచ్చింది. ఈ పరిస్థితి నుంచి అమెరికా కోలుకునేందు కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం లేకపోలేదు అన్నది నిపుణుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: