మన దేశంలో జనాలకు కాస్త ప్రేమలు అభిమానాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పక్కింటి వాళ్ళు అంటే గౌరవం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని కొందరు కాస్త అతి చేసే వాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉంటారు. కరోనా వైరస్ ఉన్నా సరే చాలా మంది పక్కింటి వాళ్ళ మీద ఉన్న గౌరవం తో కనీసం పట్టించుకోవడం లేదు ఇప్పుడు. కరోనా వైరస్ కట్టడి కావడం అనేది ఇప్పుడు చాలా అవసరం. 

 

లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి అది గ్రామ స్థాయిలో విస్తరించింది అంటే దేవుడికి దండం పెట్టడం మినహా మనం చేసేది ఏమీ ఉండదు అని అంటున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రజల నుంచి సహకారం ఉండాలి. పక్కింటి ఆంటీ పిల్లల పుట్టిన రోజు, ఆ ఆంటీ పార్టీ ఇస్తుంది, అంకుల్ కి జీతం పడి పార్టీ ఇస్తున్నాడు వంటి వాటికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ అంకుల్ ఎక్కడికి వెళ్లి వచ్చాడో తెలియదు కదా...?

 

ఆ అంకుల్ ఆరోగ్యం ఎలా ఉందో మీకు తెలియదు కదా...? వాళ్ళ ఇళ్ళకు వచ్చిన వాళ్ళ గురించి మీకు తెలియదు కదా...? కాబట్టి అన్నీ కంట్రోల్ చేసుకుని ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉంటే మన పక్కింటి వాళ్ళే కాబట్టి ఎన్ని పార్టీలు అయినా చేసుకోవచ్చు. ఎన్ని కేకులు అయినా సరే కోసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఈ నాలుగు రోజులు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతీ ఒక్కరు దాని తీవ్రతను అర్ధం చేసుకుని ప్రవర్తిన్చాల్సిన అవసరం ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: