దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ప్రకటించిన తొలి రోజుల్లో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ దేశంలో రోజురోజుకు లాక్ డౌన్ ఎఫెక్ట్ క్రమంగా తగ్గుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కొంతమంది ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పదేపదే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. 
 
మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు లెక్క చేయకపోవడంపై మోదీ సీరియస్ అయ్యారని సమాచారం. ఈరోజు మోదీ దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం దేశవ్యాప్తంగా మరో సంచలన నిర్ణయం అమలు అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ప్రభుత్వమే అందించేలా చేయడంతో పాటు ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం అయ్యే విధంగా ఆ నిర్ణయం ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త నిబంధనల ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం అయ్యే విధంగా కేంద్రం ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. కుంటి సాకులు చెబుతూ రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. 
 
పలు రాష్ట్రాల్లో పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో కేంద్రం లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరిగేలా చేయాలని... సరిగ్గా అమలు కాని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి ఆయా ప్రాంతాలలో ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తొంది. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తే మాత్రమే కరోనా నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: