కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో, రోగుల ప్రాణాలు కాపాడే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు వైద్యులు. కరోనా వైరస్ అనేది క్రమంగా పెరుగుతుంది. దీనితో వైద్యులు అయితే తమ కుటుంబాలను కూడా వదిలి దీని కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. వాళ్ళు అందరూ కూడా నిద్ర లేకుండా సరైన ఆహారం కూడా లేకుండా కష్టపడటం చూస్తుంటే ఇప్పుడు వాళ్ళని చూసి జాలి పడే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. 

 

ఇది పక్కన పెడితే మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వైద్యులకు సరైన రక్షణ లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. వైద్యులకు ఇప్పుడు సరైన కోట్ లు గాని, మాస్క్ లు గాని, గ్లాస్ లు గాని అందించడం లేదని అంటున్నారు. కరోనా వైరస్ పెరుగుతుంది... ఇప్పుడు వాళ్ళ అవసరం చాలా ఉంది. కాబట్టి విదేశాల నుంచి అయినా పరికరాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. 

 

కొందరు బండి హెల్మెట్, రైన్ కోట్, చలి కోటులు వంటివి వేసుకునే పరిస్థితి మన దేశంలో ఉంది. కరోనా కట్టడి కావాలి అంటే వాళ్ళు చాలా కీలకం, కాబట్టి ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు రక్షణ లేకపోతే మాత్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది సాధ్యం కాదు. వాళ్ళ అవసరం గుర్తుంచుకుని జాగ్రత్తగా వాళ్ళను కాపాడుకోవాలని, అప్పుడే మరికొంత మంది వైద్యులు బయటకు రావడానికి ఆసక్తి చూపిస్తారని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: