మరణం మనిషికి ఎటువైపు నుండి ముంచుకొస్తుందో తెలియదు.. అందులో ప్రస్తుత పరిస్దితుల్లో ఎంతమంది మృత్యువాత పడుతున్నారో నిత్యం చూస్తూనే ఉన్నాం.. ఎక్కడ చూడు చావులే.. ఇకపోతే కరెంట్ ఇది ఎంత ప్రమాదమైనదో, అంతగా ఉపయోగమైనది. ఈ విద్యుత్ ప్రాణాలు తీయగలదు. ప్రాణాలు నిలబెట్టగలదు.. దీన్ని వాడేవిధానం బట్టి ఉంటుంది.. ఇకపోతే ఒక్క క్షణం కరెంట్ పోతే తట్టుకోలేని రీతిగా మనిషి తయారు అయ్యాడు.. అందులో మనజీవితంలో కరెంట్ పూర్తి భాగాన్ని ఆక్రమించింది..

 

 

మనిషికి కాస్త విశ్రాంతి ఉంటుంది. కానీ కరెంట్‌కు విశ్రాంతినిస్తే మనిషి తట్టుకోలేడు.. ఇంతలా మానవుని జీవితంలో విద్యుత్ కలిసి పోయింది.. ఇకపోతే కరెంట్ విషయంలో ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్న అది ఎన్నో ప్రమాదాలకు మూలం అవుతుంది..  ఇలాగే పాపం ఈ విద్యుత్ ఆకలికి తల్లికూతురు బలి అయ్యారు.. ఆ వివరాలు తెలుసుకుంటే.. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్‌ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన షార్ట్‌సర్య్కూట్ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు..

 

 

లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన పడకంటి శ్రీనివాస్‌కు అనిత(22) తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు శ్రీనిత్, కుమార్తె శ్రీనిత(1) ఉన్నారు. కాగా శ్రీనివాస్ ఆటో నడుపుకుంటు తన భార్యపిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.. అయితే ఎప్పటిలాగే తన డ్యూటీ నిమిత్తం వెళ్ళిన శ్రీనివాస్ ఇంకా ఇంటికి రాలేదు.. అయితే బుధవారం మధ్యాహ్న సమయంలో అనిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోయారు.. ఇంతలో ఏం జరిగిందో ఏమో గాని వీరు ఉంటున్న ఇంట్లో షార్ట్‌సర్య్కూట్ జరిగి మంటలు చెలరేగాయి.

 

 

ఈ విషయాన్ని అనిత గమనించేలోగానే మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. అంతలో అనిత భయంతో కేకలు వేయగా, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. శ్రీనిత్‌ను వారు కాపాడగా అనిత, శ్రీనిత మంటల్లో చిక్కుకుని వారి కళ్లెదుటే సజీవ దహనమయ్యారు. అంతమంది గ్రామస్దుల ఎదుటే ఈ రెండు ప్రాణాలు సజీవదహనం అవడంతో, ఆ కుటుంబంలో, ఆ గ్రామంలో విషాదం అలుముకుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: