ఏపీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 67 కొత్త కేసులు న‌మోదు కావ‌డం అంద‌రిని తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు కేవ‌లం 44 కేసులే ఉండ‌గా ఇప్పుడు ఒక్క‌సారిగా 67 కొత్త కేసుల‌తో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య బుధవారం రాత్రికి 111కు చేరుకుంది. అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే ఇన్నీ కేసులు ఉండ‌గా.. ఇప్పుడు మ‌రిన్ని కొత్త కేసులు బ‌య‌ట ప‌డే ఛాన్స్ ఉంద‌ని కూడా అంటున్నారు. బుధవారం ఒక్కరోజే 67 కొత్త కేసులు బయటపడ్డాయి. 

 

బుధ‌వారం రాత్రి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ భాగం ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని తెలుస్తోంది. ఇక ఏపీ నుంచి ఢిల్లీకి మత ప్రార్థనలకు వెళ్లిన వారిని ఇరాన్, ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కలవడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని భావిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 11 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలాంటి కేసులు లేకపోవడం ఊరటనిస్తోంది. 

 

ఇక ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చిన వారి కుటుంబాల్లో కూడా చాలా మందికి ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో ఇప్పుడు అస‌లు క‌రోనా ఎంత మందికి సోకిందో కూడా అర్థం కాని ప‌రిస్థితి. ఇక గుంటూరు జిల్లాలోనే ఏపీలో అత్య‌ధికంగా 20 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గుంటూరు జిల్లా రాజ‌ధాని ప్రాంతం కావ‌డంతో అస‌లు ఇక్క‌డ ప‌రిస్థితి విజృంభిస్తుండ‌డంతో ఇప్పుడు ప్ర‌భుత్వ యంత్రాంగం ఇక్క‌డ సీరియ‌స్‌గా కాన్‌సంట్రేష‌న్ చేస్తోంది. జిల్లాలో ఇప్ప‌టికే మూడు ప్రాంతాల‌ను రెడ్ జోన్లుగా కూడా గుర్తించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

 Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: