కరోనా మహమ్మారి ఇప్పుడు దేవుళ్లను కూడా వదలడం లేదు.   ఎక్కడ చూసినా ఈ కరోనా భయంతో వణికి పోతున్నారు.  ఈ నేపథ్యంలో జనసంద్రంగా ఉండే ఒంటిమెట్టు ఆలయం బోసి పోయింది. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఎంతో గొప్పగా పూజలు అందుకునే శ్రీరాముడు చిన్నబోయారు. భ క్తులు ఎవరూ లేకుండా ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో భక్తులకు అనుమతి నిరాకరించగా, అర్చకుల సమక్షంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు మాత్రమే పాల్గొన్నారు.  తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి అంటే భద్రాచలం, ఒంట మెట్టు ఆలయం ఫేమస్ అన్న విషయం తెలిసిందే.  కానీ ఇప్పుడు కరోనా భద్రత వల్ల లాక్ డౌన్ నేపథ్యంలతో ఎవరి బయటకు రావొద్దన్న ఆంక్షలు ఉన్నాయి.. 

 

ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. ఆపై ఆగమశాస్త్ర ప్రకారం, పుట్టమన్నును తీసుకుని వచ్చి, బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఉదయం 9 గంటల సమయంలో ధ్వజారోహణం నిర్వహించిన అర్చకులు, నేటి రాత్రి శేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.   భక్తులు ఒకవేళ వచ్చినా సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది.. ఈ నేపథ్యంలో శానిటైజేషన్ చేసి పరిశుభ్రంగా ఉంచారు. 

 

పరిమిత సంఖ్యలో హాజరయ్యే పూజారులు, అధికారుల సమక్షంలో నిర్వహిస్తామని ఆలయ డిప్యూటీ ఈఓ వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో శ్రీరామనవమి ఉత్సవాలకు కిక్కిరిసిపోయే ఒంటిమిట్ట, ఇప్పుడు భక్తులు కనిపించక బోసిపోయింది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: