ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవన్‌లో జరిగిన ప్రార్థనలకు హాజరైన తబ్లీగ్ జమాత్ ప్రతినిధుల వల్లే క‌రోనా అత్య‌ధికంగా వ్యాప్తి చెందింది.  క‌రోనా ర‌క్క‌సి అన్ని రాష్ట్రాల‌కు దిగుమ‌తి అయింద‌నే చెప్పాలి.  ఇప్పుడు ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని గుర్తించి, క్వారంటైన్‌కు త‌ర‌లించే ప‌నిలో ప‌డ్డాయి. తబ్లీగ్ ప్రతినిధుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 389 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. అయితే మరో 8వేల మంది ఫలితాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. అంతేకాక వీరితో ఇటీవ‌లి కాలంలో స‌న్నిహితంగా ఉన్న‌వారిని కూడా వైద్యులు ప‌రీక్ష‌ల‌కు పంపారు. త‌బ్లీగ్ జ‌మాత్ ప్ర‌తినిధుల కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

 

ఈ త‌ర‌హా కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క తెలంగాణ‌లోనే ఎనిమిదికిపైగా గుర్తించిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఇదిలా ఉండ‌గా దేశంలోని కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్‌లకు కేంద్రం గుర్తించింది. ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్, దిల్షాద్ గార్డెన్, రాజస్థాన్‌లోని భిల్వారా, గుజరాత్‌లోని అహ్మదాబాద్, మహారాష్ట్రలోని ముంబయి, పుణే, కేరళలోని కాసర్‌గఢ్, పథనంథిట్టా, ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా, మీరట్‌లో వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రాలుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.  ఈ ఆరు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తుండ‌టం గ‌మ‌నార్హం. 

 

అయితే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ఇప్పుడే వ్యాప్తి మొద‌లైంద‌ని కేంద్రం భావిస్తోంది. ప‌రిస్థితి మ‌రీ చేయి దాటిపోయే ప్ర‌మాదం ఇక్క‌డ లేద‌ని అధికారులు చెబుతున్నారు.దేశంలో కోవిడ్-19 కేసులు గడచిన మూడు రోజుల నుంచి శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 2,000 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, 59 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 70 దేశాల నుంచి వచ్చిన 2 వేల మంది తబ్లీగీ జమాత్‌ కార్యకర్తలు ప్రస్తుతం దేశంలోని పలుచోట్ల మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మత ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 5,000 మందిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అంద‌జేస్తున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: