ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్ వల్ల సింగపూర్ లో ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో ఈ దేశంలో చనిపోయిన వారి సంఖ్య 4కి చేరింది. కరోనా బారిన పడిన వారి సంఖ్య 74కి చేరుకోగా, వీరిలో భారతీయులు 7 మంది ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోనేసియా కు చెందిన 68ఏళ్ల వ్యక్తి సింగపూర్ కి పనికి వచ్చి కరోనా బారిన పడ్డాడు. గత నెల 22న నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ (ఎన్ సి ఐ డి) కరోనా ఉన్నట్లుగా నిర్ధారించింది. ఇతనికి డయాబెటిస్, హైపర్ టెన్షన్ అధికంగా ఉండడంతో ఐసొలేషన్ లో ఉంచారు. 

 

ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వారు కరోనా బారిన పడి ఉన్నారని, బుధవారం నాటికి వీరి సంఖ్య 1000 చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 24 మందికి ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదు. వీరు కోసం ప్రత్యేక వార్డుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నామన్నారు. 245 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. వీరిని డిశ్చార్జ్ చేశామన్నారు.

 

జాన్స్ హోప్ కిన్స్ యూనివర్సిటీ ప్రకారం 175 దేశాల్లో కరోనా బారిన 9,32,605 మంది పడ్డారని, 16,809 చనిపోయినట్లు గా తెలిపారు.కొత్తగా 20 కేసులను దిగుమతి చేసుకుంటున్నామని, ఆస్ట్రేలియా, యూరప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాన్ మరియు ఆసియాలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణ చరిత్ర ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఇరవై నాలుగు కరోనా వైరస్ రోగులు పరిస్థితి విషమంగా ఉంది. ధృవీకరించబడిన 457 కేసులలో చాలావరకు, ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాయి, స్థిరంగా లేదా మెరుగుపడుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 245 కేసులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ చేయబడ్డాయి లేదా కమ్యూనిటీ ఐసోలేషన్ సేవలకు మార్చబడ్డాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: