మ‌ర్క‌జ్ మూల‌ల‌తో తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోతోంది. తాజాగా ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ వివ‌రాల ప్ర‌కారం.. తెలంగాణలో ఇప్ప‌టి వ‌ర‌కు 127 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కొత్త‌గా మోద‌వుతున్న పాజ‌టివ్ కేసుల్లో మ‌ర్క‌జ్ మూలాల‌కు చెందిన‌వే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. బుధవారం (ఏప్రిల్ 1) ఒక్క రోజే రాష్ట్రంలో కొత్త‌గా 30 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. కరోనాతో మరో ముగ్గురు బుధ‌వారం మృతి చెందడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇందులో గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు వైరస్‌ కారణంగా మరణించిన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.  

 

రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ్యాధితో మృతిచెందిన వారి సంఖ్య‌లోగ‌ దీంతో మొత్తం మరణాల సంఖ్య తొమ్మిదికి చేరింది. మర్కజ్ మత కార్యక్రమం కారణంగా రోగుల నుంచి కుటుంబసభ్యులు, బంధువులకు వైరస్ వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1030 మంది తబ్లీగ్ జ‌మాత్ ప్ర‌తినిధులు మర్కజ్ ప్రార్థనలకు హాజరైనట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. వీరిలో ఇంకా 160 మందికి సంబంధించిన ఆచూకీ ల‌భ్యం కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా నిజామాబాద్‌లో వైద్య ప‌రీక్ష‌ల‌కు వెళ్లిన వారిపై ముస్లింలు దాడుల‌కు దిగ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

 

 వైద్యుల‌కు ఎంత‌మాత్రం కొంత‌మంది స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.  ఇంకా 160 మందిని గుర్తించాల్సి ఉండగా.. 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వీరి రిపోర్టుల్లో ఏం తేలుతుందోన‌న్న టెన్ష‌న్ రాష్ట్ర ప్ర‌జానీకంలో క‌న‌బ‌డుతోంది. ఢిల్లీ వెళ్లచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉంటే.. వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జ‌రిగిన స‌మావేశంలో పిలుపునిచ్చారు. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న‌తో కొంత‌మంది ముందుకొచ్చారు... 60 మంది జ‌మాత్ ప్ర‌తినిధుల ఆచూకీ ల‌భ్యం కాక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మొత్తంగా మ‌ర్క‌జ్ మత కార్యక్రమం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా 30 పెరిగాయి. దీంతో 127కు చేరుకున్నాయి. 9 మరణాలు సంభవించాయి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: