ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్రంలో గోమూత్రానికి గిరాకీ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడి ప్రజలు రోజుకి ఆరు వేల లీటర్ల గోమూత్రాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎందుకయ్యా అని ప్రశ్నిస్తే? గోమూత్రం తాగితే కరోనా వైరస్ అస్సలు రాదని చెబుతున్నారు.

 

తాజాగా రాష్ట్రీయ కామదేను ఆయోగ్ చైర్మన్ వల్లభ్ కతిరియా మీడియాతో మాట్లాడుతూ గుజరాతి ప్రజలు ఆవు మూత్రాన్ని, ఘనీకృత ఆవు మూత్రాన్ని రోజుకి ఆరు వేల లీటర్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆవు మూత్రాన్ని విక్రయించే వ్యాపారాలతో పాటు కొంతమంది రాజకీయ నేతలు గోమూత్రం సర్వ రోగాలని నాశనం చేస్తుందని చెప్పడంతో... లక్షల మంది ప్రజలు గోమూత్రాన్ని కొనుగోలు చేసి లీటర్ల కొద్దీ తాగుతున్నారు. కేవలం తాగటం మాత్రమే కాదు... గోమూత్రాన్ని స్ప్రే బాటిల్స్ లలో నింపి తమ శరీరమంతా సెంట్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు ప్రజలు. ఇలా చేస్తే వారి చెంతకు ఎటువంటి వైరస్ గానీ బ్యాక్టీరియా గానీ దరిచేరదని వారి నమ్మకం.


గోమూత్రం తాగడం వలన జీర్ణక్రియ/ జీర్ణ వ్యవస్థ మెరుగుపడడంతో పాటు రక్షకభటులు అని పిలవబడే లింఫోసైట్లుని( తెల్లరక్తకణాలలో ఒక రకం) బలపడతాయని వల్లభ్ కతిరియా చెప్పుకొచ్చారు. ఇటీవల అంకాలజీ సర్జన్ యూనియన్ మినిస్టర్ కూడా గోమూత్రం తాగడం వలన కరోనా వైరస్ దరిచేరదని చెప్పారు. వల్లభ్ కతిరియా ఇంకా మాట్లాడుతూ... గోమూత్రం తో తయారైన హ్యాండ్ శానిటైజర్లని కూడా తాము విక్రయిస్తున్నామని తెలిపారు.


గుజరాత్లోని అహ్మదాబాద్ కి పొందిన ఓ గోమూత్ర వ్యాపారి మాట్లాడుతూ... తాను మునుపటి రోజుల్లో కేవలం 70 నుండి 80 గో మూత్ర బాటిల్స్ లని అమ్మేవాడినని... కానీ కరోనా వైరస్ దయవలన రోజుకి 425 గోమూత్ర సీసాలని విక్రయిస్తున్నానని తెలిపాడు. గోమూత్రంలో అల్లం, తులసి, ఇంకా ఇతర మూలికలను కూడా కలిపి తమ కస్టమర్లకు అందిస్తున్నానని తాను చెప్పాడు. ఇది తాగడం వలన దగ్గు జలుబు జ్వరం లాంటి అనారోగ్య సమస్యలు అస్సలు తలెత్తవని ఆయన అంటున్నాడు.


మొన్నీమధ్య కర్ణాటక రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు ఆవు పేడలో స్నానం చేస్తూ... కరోనా 'బాక్టీరియా' రాదు అంటూ బోధించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ ని ఆవు మూత్రం, లేకపోతే ఆవుపేడ నివారిస్తుందని ఇప్పటివరకు సైంటిఫిక్ పరంగా ఎటువంటి ఆధారాలు లేవు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: