రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు ముందుకు రావాలి. ప్ర‌స్తుతం నెల‌కొన్న క‌రోనా ఎఫెక్ట్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో వీధుల పాలైన అభాగ్యులు, అనాధ‌ల‌కు పార్టీ త‌ర‌ఫున నాయ‌కులుత‌మ‌కు తోచిన సాయం అందించాలి. ఈ విష‌యంలో అంద‌రూ ముందుకు రావాలి- ఇదీ రెండు రోజుల నుంచి టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ నాయ‌కుల‌కు ఇస్తున్న పిలుపు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌భుత్వానికి కూడా త‌న‌కు తోచిన మేర‌కు ఆర్థిక సాయం అందించారు. అయితే, మ‌రి బాబు మాట‌ల‌ను ల‌క్ష్మ‌ణ‌రేఖ‌గా భావిస్తామ ని, ఆయ‌న గీసిన గీత‌లు దాట‌బోమ‌ని చెప్పే నాయ‌కులు ఇప్పుడు చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపు మేర‌కు స్పందిస్తార‌ని, వీధుల్లో పోటెత్తుతార‌ని అంద‌రూ అనుకున్నారు.



అయితే, దీనికి బిన్నంగా టీడీపీ నుంచి ఒక్క‌రూ ముందుకు రాలేదు. అంతేకాదు, ఏ ఒక్క‌రూ కూడా ముందుకు వ‌చ్చి మేం ఇం త సాయం చేస్తున్నాం.. అని ప్ర‌క‌టించ‌నూలేదు. ఇక‌, కీల‌క న‌గ‌రాలైన విజ‌య‌వాడ‌, విశాఖ‌, రాజ‌మండ్రి ప్రాంతాల్లోనూ ప‌రిస్థితు లకు అనుగుణంగా ప్ర‌జ‌లకు సాయం చేసేందుకు త‌మ్ముళ్లు ముందుకు రాక‌పోవ‌డం గ‌మనార్హం. దీంతో చంద్ర‌బాబు మాట ఏమైంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్పుడు పార్టీలో నేత‌లు చాలా త‌క్కువ‌మంది ఉన్నారు. ఉన్న‌వారిలోనూ పార్టీపై కొంగ‌జ‌పం మాదిరిగానే నిబ‌ద్ధ‌త ఉంద‌నేది వాస్త‌వం.



ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి అవ‌కాశం వ‌స్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇక‌, బాబుకు అత్యంత విశ్వాస‌పాత్రులు కూడా ఇప్పుడు ఎందుకులే..ఉన్న‌ది ఇచ్చేస్తే ఎలా అనే ధోర‌ణిని అవ‌లంభిస్తున్నారు. ఫ‌లితంగా చంద్ర‌బాబు మాట‌ల‌కు అర్ధం లేకుండా పోయింది. నిజానికి ప్ర‌జ‌ల‌కు సేవ‌ను ప‌క్క‌న పెడితే.. గ‌త నెల 29న టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వం జ‌రిగింది. అయితే, క‌రోనా ఎఫెక్ట్‌తో చంద్ర‌బాబు ఎక్క‌డిక‌క్క‌డే  జిల్లా, న‌గ‌ర పార్టీ ఇంచార్జులు, మండ‌ల‌స్థా యి నేత‌లు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని వీడియో కాన్ఫ‌రెన్సు పెట్టి మ‌రీ చెప్పారు. దీనికి ఆ స‌మ‌యంలో అంద‌రూ ఓకే అంటూ త‌ల‌లాడించారు. కానీ, త‌ర్వాత ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఒక‌రిద్ద‌రు, కొన్ని జిల్లాల్లో త‌ప్ప టీడీపీ ఆవిర్భావ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది లేదు.



ముఖ్యంగా బ‌ల‌మైన విశాఖ‌లో న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడు రెహ‌మాన్ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో చాలా జిల్లాల్లో నాయ‌కులు బాబు మాట‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోలేదు. మ‌రి పార్టీ కార్య‌క్ర‌మానికే ఇలాంటి స్పంద‌న ఉంటే..ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు, డ‌బ్బులు ఇచ్చేందుకు త‌మ్ముళ్లు ఎలా ముందుకు వ‌స్తార‌ని బాబు అనుకున్నారో ఆయ‌నకే తెలియాలి. ఏదేమైనా ప్ర‌స్తుత ప‌రిస్థితిని బాబు రివ్యూ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: