దేశ వ్యాప్తంగా అతి భయంకరమైన కరోనా వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే వైద్య సిబ్బంది, పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ తమ సేవలు అందిస్తున్నారు. అలాంటి వైద్య సిబ్బంది... అందులోనూ మహిళలపై దారుణంగా దాడి చేసి కలకలం సృష్టించారు.  మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని ఓ ప్రాంతానికి కరోనా వైరస్ కోసం హెల్త్ వర్కర్స్ తో కూడిన డాక్టర్ల బృందం వెళ్లగా, ఓ వర్గం వారు ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగడంతో, ఇద్దరు మహిళా వైద్యులు తీవ్ర గాయాల పాలయ్యారు. 

 

ఇండోర్ పరిధిలోని రాణీపురా అనే ప్రాంతంలోని కొందరు న్యూఢిల్లీలోని ప్రార్థనలకు వెళ్లి వచ్చారని తెలుసుకున్న అధికారులు, ఆ ప్రాంతానికి వెళ్లిన వేళ ఈ ఘటన జరిగింది. దాదాపు 100 మంది నిరసనకారులు, కర్రలు, రాళ్లు పట్టుకుని వచ్చి, ఇరుకుగా ఉన్న వీధిలో హెల్త్ వర్కర్ల వెంట పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. అయితే లేత నీలం రంగు పీపీఈ వైద్య సిబ్బందిని టార్గెట్ చేసుకొని దాదాపు 100 మంది నిరసనకారులు, కర్రలు, రాళ్లు పట్టుకుని వచ్చి, ఇరుకుగా ఉన్న వీధిలో హెల్త్ వర్కర్ల వెంట పడ్డారు.

 

 

ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.   కోవిడ్ పాజిటివ్ కేసులు రావడంతో, అప్రమత్తమైన అధికారులు, 54 కుటుంబాల వారిని క్వారంటైన్ చేసేందుకు వెళ్లగా, స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.  కాగా, డాక్టర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: