క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి క్ర‌మంగా అన్ని దేశాలు వ్యాప్తించి.. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఏపీలో గ‌త రెండు రోజులుగా క‌రోనా వైర‌స్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. గత అర్ధరాత్రి 65 ఏళ్ల వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పురపాలక సంఘ కమిషనర్‌ హేమమాలిని తెలిపారు. 

 

అయితే  ఆ వ్యక్తి ఇటీవల ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు నివసిస్తున్న టిప్పర్ బజార్‌లోని ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్టు పురపాలక సంఘ కమిషనర్ హేమమాలిని తెలిపారు. అతడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 132కి చేరాయి. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం బులిటెన్ విడుద‌ల చేసింది. ఇక మంగ‌ళ‌గిరిలో క‌రోనా కేసు వెలుగు చూడడంతో ముందు జాగ్రత్త చర్యగా సమీపంలో కూరగాయల దుకాణాలు, మార్కెట్లను మూసివేయించారు. 

 

అలాగే 144 సెక్షన్ విధించి, ఆ ప్రాంతం మొత్తాన్ని రెడ్ అలర్ట్‌గా ప్రకటించారు. ఇక రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి.  కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల్లో 15మంది చొప్పున కరోనా వ్యాధి బారిన పడ్డారు. కాగా, గత నెలలో న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మత ప్రార్థనలకు 7,600 మంది భారతీయులు, 1,300 మంది విదేశీయులు హాజరైనట్టు గుర్తించామని, దీంతో దాదాపు 9 వేల మంది ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రమాదం అంచున ఉన్నారని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: