క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో క‌ళ్లు బైర్లు కమ్మే నిజ‌మొక‌టి వెలుగులోకి వ‌స్తోంది. అదేమంటే క‌రోనా రాక్ష‌సి బారిన ప‌డుతున్న‌వారిలో యువ‌తే ఎక్కువ‌గా ఉంటోంద‌ని లెక్క‌లు చెబుతున్నాయి. ప్రధానంగా 20 నుంచి 40 ఏళ్ల వయసు వారిపైనే తన ప్రతాపం చూపుతోంది. దేశంలో కరోనా కేసులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, వాటి వివరాలు ట్రాక్‌ చేస్తున్న ‘కరోనా ట్రాకర్‌’అనే వెబ్‌సైట్‌ పాజిటివ్‌ కేసుల వివరాలను విశ్లేషించింది. వెబ్‌సైట్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దేశంలో యువకులపై కరోనా పంజా విసురుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. భార‌త్‌లో బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 1,751 కేసులు నమోదయ్యాయి. 

 

ఇందులో  614 కేసుల వివిధ కోణాల్లో విశ్లేష‌ణ చేస్తూ వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు.  614 కేసుల్లో  20 నుంచి 30 ఏళ్ల వయసున్నవారు 157 మంది ఉన్న‌ట్లు పేర్కొంది. అలాగే 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న‌వారు 129 మంది ఉన్నారని తెలిపింది.  అలాగే  40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న‌వారు వారు 97, 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారు 96 మంది ఉన్న‌ట్లు పేర్కొంది.  60 నుంచి 70 మధ్య వయసు వారు 72 మంది వ‌ర‌కు ఉన్న‌ట్లు విశ్లేషించింది. ఇక వృద్ధాప్య ద‌శ‌లో ఉన్న‌వారు అంటే  80 నుంచి 100 ఏళ్ల మధ్య వయసు వారు ఏడుగురు క‌రోనా బారిన ప‌డ్డార‌ని తెలిపింది. 10 ఏళ్లలోపు ఉన్న చిన్నారులు  15 మంది వ‌ర‌కు క‌రోనా వైర‌స్‌తో బాధ‌ప‌డుతున్నారు. 


70 నుంచి 80 ఏళ్ల వయసు వారు 18 మంది వ‌ర‌కు ఉండ‌టం గ‌మ‌నార్హం. అయితే 10 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు వారు 23 మంది వ‌ర‌కు కరోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. ఈ లెక్కల ప్ర‌కారం. 20 నుంచి 40 ఏళ్ల‌లోపు ఉన్న‌వారే క‌రోనా బారిన ప‌డుతున్నార‌ని తెలిపింది. అయితే ఈ వ‌య‌స్సు వారు వివిధ ప‌నుల రీత్య‌, వృత్తుల రీత్య ఎక్కువ‌గా బ‌య‌ట తిర‌గ‌డం వ‌ల్లే వైర‌స్ సోకి ఉంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ఇమ్యూనిటీ ప‌వ‌ర్ అధికంగా ఉన్నా స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే క‌రోనా బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కాబ‌ట్టి యువ‌త బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌స్తే త‌గు జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క పాటించాల‌ని సూచిస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: