కరోనా వైరస్ జనాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నెల 14 వరకు ప్రజలు అంతా లాక్ డౌన్ లో ఉండాలనే మోదీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జనం వాటిని పాటించడం జరుగుతోంది. కానీ ఈ రూల్స్ ని అతిక్రమిస్తే కూడా వాళ్లకి శిక్ష తప్పడం లేదు. కరోనా మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తోంది. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అనేక మందిని ఇప్పటికే  కరోనా బాధితుల్ని చేస్తోంది .

 

 

ఇప్పటికే ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఖండాలన్నీ దాటేసి  ప్రపంచాన్నే చుట్టుముట్టేసింది ఈ భూతం. అయితే ఏది ఏమైనా సరే జాగ్రత్తలు పాటిస్తూ అధికారుల చెప్పిన మార్గాలని అనుసరించడం ముఖ్యం. అయితే ఇటీవలే ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ వద్దకి వెళ్లిన వారిలో చాలా మందికి కరోనా టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది . ఈ కారణం వల్లే హఠాత్తుగా కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరిగింది .

 

 

ఇంకేం ఉంది ఎంతో మంది ఈ కరోనా వైరస్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ లో మర్కజ్ కి వెళ్లిన వారిలో ఆరుగురు మరణించారట. అయితే చనిపోయిన వారిని ఖననం చెయ్యాలా లేక దహనం చెయ్యాలా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది .

 

 

ఏది చేసినా మాత్రం జాగ్రత్తలని పాటించడం కూడా ముఖ్యమే. అయితే WHO ఏం చెయ్యాలి అనే దానిపై స్పష్టత  తెలిపింది. అయితే ముంబాయి మునిసిపల్ కమిషనర్ ప్రవీణ్ పరదేశి మృతులని దహనం చెయ్యాలని సర్క్యులర్ పంపడంతో ఈ వార్తా వెలుగులోకి వచ్చింది. అయితే WHO చెప్పినట్టు దహనమే చెయ్యాలి అని సర్క్యులర్ పంపితే మహారాష్ట్ర మైనారిటీ డెవలప్ మెంట్ మంత్రి నవాబ్ మాలిక్ ఈ సర్క్యులర్ ని వ్యతిరేకించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: