ఏపీలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారే అధిక సంఖ్యలో కరోనా భారీన పడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. 
 
ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల ప్రభావం రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే కర్నూల్ పై ఎక్కువగా పడింది. రాష్ట్రంలో ఢిల్లీ సదస్సుకు 1000 మంది హాజరైతే వారిలో 400 మంది కర్నూలు జిల్లా నుంచే హాజరు కావడం గమనార్హం. అధికారులు ఇప్పటికే వారిలో 380 మందిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. మిలిగిన వారి కోసం జిల్లా వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు ఎవరైనా ఢిల్లీ సదస్సుకు హాజరై ఉంటే స్వచ్ఛందంగా తమ వివరాలను చెప్పాలని అన్నారు. 
 
కర్నూలు జిల్లాలో ఇప్పటివరకూ ఒక కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో ఢిల్లీ జమాత్ సదస్సులో హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా సోకుతూ ఉండటంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొందరి నమూనాలను ల్యాబ్ కు పంపగా వారి రిపోర్టులు ఇంకా అందాల్సి ఉంది. 400 మంది జిల్లావాసులు ఢిల్లీకి వెళ్లారని తెలియడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల నుంచి ముస్లింలు ఈ సదస్సుకు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 132కు చేరింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోను కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉదయం వరకు 127 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది మృతి చెందారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: