ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తున్న భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్‌-19). చైనాలో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ప్రస్తుతం 199 దేశాల్లో విళయతాండవం చేస్తోంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా కరోనా బారి నుంచి ఎలా బయట పడాలో తెలియక సతమతమవుతోంది. ఇక మిగిలిన దేశాలు సైతం అదే ప‌నిలో ప‌డ్డాయి. ఇప్ప‌టికే ఈ వైర‌స్ కార‌ణంగా వేలాదిమంది ప్రాణాలు పోయాయి. లక్షలాది మందికి వైరస్ సోకింది. అలాగే క‌రోనాకు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. నివార‌ణ‌పైనే దేశ‌దేశాలు దృష్టి సారించాయి.

 

అయితే వైరస్ వ్యాప్తి మొదలైన వెంటనే కఠిన చర్యలు తీసుకున్న చైనా.. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేసింది. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఉపద్రవం వచ్చిపడింది. కరోనా లక్షణాలైన జలుబు జ్వరం దగ్గు గొంతునొప్పి వంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ కేసులు బయట పడుతుండడంతో చైనాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. లక్షణాలు ఉన్న కేసులను గుర్తించవచ్చు. 

 

కానీ లక్షణాలు లేని వారిని ఎలా గుర్తు పట్టాలో తెలియక చైనా ఆపసోపాలు పడుతోంది. దీంతో ఇది పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ తరహా లక్షణాలు బయటపడని కేసుల సంఖ్య దాదాపు 40వేల వరకు ఉండవచ్చని చైనా మీడియా తెలిపింది. చైనా సర్కారు మాత్రం వివరాలను గోప్యంగా ఉంచుతోంది. ఇక కరోనా లక్షణాలు లేకపోవడంతో తమకేమీ కాలేదని చాలా మంది బయట తిరుగుతూ వందలాది మందికి వైరస్ అంటిస్తున్నారు. దీంతో అనేక మంది రిస్క్‌లో ప‌డాల్సి వ‌స్తుంది. ఇటీవ‌ల విశాఖపట్నంలోనూ కరోనా లక్షణాలు ఏవీ లేకున్నా వారికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఏదేమైనా క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు త‌న విశ్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెడుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: