ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు గంట గంటకు పెరుగుతున్నాయి. కరోనా ఏ దశలు తగ్గే మార్గం కనపడట౦ లేదు. అభివృద్ధి చెందిన దేశాల నుంచి చెందే దేశాలు, ఏ మాత్రం అభివృద్ధి లేని దేశాలు అన్నీ కూడా ఇప్పుడు కరోనా కారణంగా నానా అవస్థలు పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు అన్ని దేశాల్లోను ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కళ్ళ ముందు తిరిగిన వాళ్ళు కూడా కరోనా దెబ్బకు రాలిపోవడం భయపెడుతుంది. 

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 937,941 గా ఉన్నాయి. వీరిలో 47,273 మంది ప్రాణాలు కోల్పోయారు. 195,188 మందికి వ్యాధి నయం అయింది. 659,708 (95%) మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 35,772 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. 215,344 మంది అమెరికాలో కరోనా బారిన పడ్డారు. ఇక ఇటలీలో 110,574 మందికి కరోనా వైరస్ సోకింది. 13,155 మంది ఇటలీలో ప్రాణాలు కోల్పోయారు. 

 

మన దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,032 మందికి కరోనా సోకింది. వీరిలో 50 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ క్రమంగా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తుంది. 132 మందికి కరోనా సోకింది. తెలంగాణాలో కరోనా 127 మందికి సోకింది. వీరిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: