కరోనా వైరస్ వల్ల దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుకోని పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసినదే. కరోనా వైరస్ కి మందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మొత్తం దాదాపు లాక్ డౌన్ అమలులోకి తీసుకు రావటం జరిగింది. దీంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగాలు లేక జీతాలు లేక అవస్థ పడుతున్న ఈ తరుణంలో చాలామంది ప్రజలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను ఈఎంఐల విషయంలో చొరవ తీసుకుని బ్యాంకులను వాయిదా వేసుకోవాలని చెప్పాలని సూచించడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ తో చర్చలు జరిపి మూడు నెలలపాటు బ్యాంకులు ఈఎంఐల లను వాయిదా వేయాలని కోరడం జరిగింది.

 

దీంతో చాలా బ్యాంకులు వాయిదా వేస్తున్నట్లు ఒప్పుకోవడం జరిగింది. తిరా ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేయడం అందరికీ షాక్ కి గురిచేసింది. కోతి మేటర్ లోకి వెళ్తే బ్యాంకులు అన్నీ వాయిదా అన్నాయి గాని… వడ్డీని కూడా వాయిదా వేస్తున్నామని చెప్పలేదు. దీంతో చాలా బ్యాంకులు తమ ఖాతాదారుల దగ్గర వడ్డీని రావడానికి రెడీ అయినట్లు దానికి సంబంధించిన మెసేజ్ లు కూడా ఇప్పటినుండే తమ ఖాతాదారులకు పంపుతున్నట్లు వార్తలు అనేకం వస్తున్నాయి.

 

దీంతో ప్రజలంతా కష్ట సమయంలో కస్టమర్లని ఆదుకోలేని బ్యాంకులు ఎందుకయ్యా మాకు అంటూ మండిపడుతున్నారు. అసలు లాక్ డౌన్ అమలులోకి లేకపోతే మేము మీ డబ్బులు కట్టేసాం కదా..? ప్రస్తుత పరిస్థితుల్లో మాకు తినటానికి తిండి లేదు ఇటువంటి టైం లో కూడా కనికరం చూపించకుండా ఈ విధంగా వ్యవహరించడం దారుణం అని చాలా మంది ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: