ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా  వైరస్ పై పెద్ద యుద్ధమే చేస్తుంది అనే చెప్పాలి. తాజాగా ఇలాంటి పరిస్థితిలో కూడా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో  చాల దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అత్యంత హానికరమైన   కరోనా వైరస్‌తో వారి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న డాక్టర్లపై స్థానికులు రాళ్లు, కర్రలతో దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు  మహిళా డాక్టర్లు తీవ్ర గాయాల పాలు అయ్యారు.  ఇంతలోనే ఆ ప్రాంత పోలీసులు  అలెర్ట్ అవడంతో అక్కడ అందరు ఊపిరి పీల్చుకున్నారు.

 


ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల ఇండోర్ శివార్లలోని తాట్ పత్తీ బక్కల్‌ ప్రాంతంలో రెండు  కరోనా కేసులు నమోదు అవ్వడం జరిగింది.  ఈ ప్రాంతం నుంచి 54 కుటుంబాలను ఐసోలేషన్‌లో  బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ఈ తరుణంలో తాట్ పత్తీ బక్కల్ ప్రాంతంలో  ఉన్న అనుమానితులు, రోగుల బంధువులకు పరీక్షలు నిర్వహించడానికి వైద్య బృందం ఏర్పాటు చేయడం జరిగింది. వీరిలో ఇద్దరు మహిళా డాక్టర్లు, ఆశా కార్యకర్త, మరో ఇద్దరు నర్సులు విధులు నిర్వహించడానికి రావడం జరిగింది. 

 

 

ఇది ఇలా ఉండగా  కొంత మంది  ఒక్కసారిగా బూతులు తిడుతూ వైద్య సిబ్బందితో గొడవకు దిగారు. రాళ్లు, కర్రలు, ప్లాస్టిక్ బకెట్లు.. ఏది దొరికితే అది వారిపైకి దాడులు నిర్వహించారు. ఈ ఘటనతో అక్కడి  వైద్య సిబ్బంది తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగు తీయసాగారు.  వాస్తవానికి ఆ ప్రాంతంలో కరోనా వైరస్ రోజు రోజుకి బారి స్థాయిలో వ్యాపిస్తుంది. కానీ  అక్కడి స్థానికులు మాత్రం  మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని, వైద్య సేవలకు ఇబ్బందులు కల్పిస్తున్నారని అధికారులు తెలియచేస్తున్నారు. 

 


గత రెండు రోజుల క్రితం కూడా రాణిపురా ప్రాంతంలోనూ ఇదే రీతిలో సంఘటన చోటు చేయసుకోవడం జరిగింది. ఇక  ఇప్పటి వరుకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన అన్ని కేసులలో  76 శాతం ఇండోర్  నుంచి నమోదు అవ్వడం చాల కలకలం రేపింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: