కరోన సోకిన వ్యక్తికి దూరంగా ఉండమంటారు. ఓ విధంగా అతను వైరస్ వాహకంగా పనిచేస్తున్నాడన్న మాట. అటువంటి వ్యక్తికి  దరిదాపుల్లో ఉన్నా కూడా కరోనా క్షణాల్లో సోకుతుంది. ఆ మీదట  ఇక పక్కవాడు కూడా మరో కరోనా  వైరస్ వాహకంగా మారిపోతారన్న మాట.

 

ఇక కరోనా సోకిన వ్యక్తి ఎంతమందికి అంటిస్తాడు అన్న దాని మీద ఇప్పటిదాకా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకోవడమే కానీ శాస్తీయమైన ఆధారాలు లేవు. అయితే దాని మీద పరిశోధనలు చేస్తున్న   కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కరోనా దీని మీద ప్రమాణికమైన  సమాచారాన్ని అందిస్తోంది. కరోనా బారిన పడిన ఒక వ్యక్తి మరో ముగ్గురికి కచ్చితంగా అంటిస్తాడట.

 


ఇక ఆ ముగ్గురు ఒక్కొక్కరు మరో ముగ్గురు చొప్పున వ్యాపింపజేసే అవకాశం ఉందని పేర్కొంది. అలా కరోనా వైరస్ ఊహకు అందనంత వేగంగా ఒక మహమ్మారిగా మారి మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తోందని అంటున్నారు. కరోనా కంటే మాయలాడి వేరొకరు ఉండరు. ఎందుకంటే కరోనా సోకిన వ్యక్తి అంటించిన వ్యక్తి ఇద్దరికీ తమకు కరోనా ఉందని తెలియకుండా అంటించుకుంటారు. అంత దొంగగా మారి కరోనా భారీ ఎత్తున  దెబ్బ తీస్తోందన్నమాట.

 

తీరా కరోనా వైరస్ 14 రోజులకు ముదిరితే కానీ అసలు లక్షణాలు బయటపడవు. ఈ లోగా వారు ఎంతమందికి అంటించేస్తారో ఊహించుకుంటేనే షాక్ తగులుతుంది. అందుకే కరోనా వైరస్ లేదు అని మనం ఎవరినీ అనుకోవడానికి లేదు, అంతకంటే ఏ మనిషినీ నమ్మడానికి కూడా లేదు. మనకు మనమే తగిన జాగ్రత్తలు తీసుకుని సామాజిక దూరం పాటించినపుడుఏ ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడం జరుగుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. 

 

క్వారంటెన్, లాక్ డౌన్, ఐసోలేషన్ తోనే దీనిని అరికట్టవచ్చు అని  అభిప్రాయపడుతున్నారు. కరోనాను అరికట్టడంలో  ప్రతి ఒక్కరు కీలకంగా స్వీయ నియంత్రణ పాటించాలని,  అంతే కాదు బాల్కనీ, టెర్రస్ పై కూర్చున్నా ప్రమాదం లేదని చెప్తుంది . మొత్తానికి సామాజిక దూరంతో కరోనాను కట్టడి చేయొచ్చు అని చెప్పిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ అధికారులు కరోనా చైన్ ని బ్రేక్ చేయమంటున్నారు. ఇంట్లో కూర్చోమంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: