కరోనా వైరస్ ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలులోకి తీసుకు రావడంతో దేశంలో అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని నుండి పేదవాడి వరకు ఎవరిని వదలటం లేదు కరోనా వైరస్. అమెరికాలాంటి అగ్రరాజ్యం కలిగిన దేశాలు ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో భద్రాద్రి లో జరిగిన శ్రీరామ నవమి కళ్యాణ వేడుక బోసి పోయింది. ఇలాంటి పరిస్థితి చాలా సార్లు వచ్చినా గానీ ఎప్పుడూ భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కన్నుల విందుగా జరిగేది. భక్తుల రాకతో కిటకిటలాడుతూ లక్షలాది మంది భక్తుల మధ్య సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగేది.

 

కానీ ఈసారి కరోనా మహమ్మారి తాసు పాము లా పగ పడుతూ మనిషి జాతి ని అంతం చేసే విధంగా ప్రతిచోట ఉండటంతో ప్రభుత్వాలు నియంత్రించడానికి తీసుకున్నా లాక్ డౌన్ నిర్ణయం సీతారాముల కళ్యాణ వేడుకకు పెద్ద అడ్డంకిగా మారింది. భద్రాద్రిలో తాజాగా జరిగిన సీతారాముల కళ్యాణం పండుగ నాడు పంచిపెట్టే పానకం, వడపప్పు, అన్నసంతర్పణను కూడా ఈ వైరస్ దెబ్బకు రద్దుచేశారు. అంతేకాకుండా దేవస్థానం చరిత్రలోనే తొలిసారిగా రామయ్య కల్యాణాన్ని నిత్యకల్యాణ మండపం వద్ద నిర్వహించడం జరిగింది.

 

భద్రాచల రామాలయం నిర్మాణం చేపట్టి దాదాపు 350 సంవత్సరాలు అయి ఉంటుందని చరిత్ర చెబుతోంది. ఈ 350 ఏళ్లలో ఏనాడూ భక్తులు లేకుండా సీతారాముల కల్యాణం జరగలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు అని ప్రస్తుత పరిస్థితులు బట్టి శ్రీరాముని భక్తులు అంటున్నారు. అయినా కానీ కేసీఆర్ సర్కార్ ప్రభుత్వం తరపు నుంచి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే కార్యక్రమాన్ని యథావిథిగా కొనసాగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: