భారత్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. 12 గంటల్లో దేశంలో 131 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1965కి చేరిందని చెప్పింది. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ దిక్కుమాలిన భయంకర వైరస్ రోజు రోజు కీ ప్రపంచాన్ని శాసిస్తుంది.  1764 మంది కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 151 మంది కోలుకోగా, 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలోని ధారావి ఆసియాలోనే అతి పెద్ద మురికి వాడగా చెబుతారు.

 

ఇప్పటి వరకు ఇక్కడ కరోనా కేసులు నమోదు అయినా.. మరణాలు సంబవించలేదు.  తాజాగా ఈ ధారావిలో 56 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి మరణించడంతో అక్కడి అధికారగణం ఉలిక్కిపడింది. ధారావి వంటి ప్రాంతంలో కరోనా ప్రబలితే, దానిని అడ్డుకునే పరిస్థితి చాలా కష్టమని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ధారావిలో బుధవారం సాయంకాలం ఈ తొలి మరణం నమోదైంది. కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న అతని రక్త నమూనాలను పరీక్షించగా, పాజిటివ్ వచ్చింది. కాగా, మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 59 కరోనా కేసులు బయటపడగా, ఆరుగురు మరణించారు. ప్రస్తుతం ధారావి ప్రాంతంలో దాదాపు 16 లక్షల మంది నివాసం ఉంటున్నారు.

 

మరోవైపు రాజస్థాన్‌లో కొత్తగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 129కి పెరిగాయి. మధ్యప్రదేశ్‌లో కొత్తగా 12 మందికి కరోనా సోకింది. కరోనా బాధితుల సంఖ్య 98కి చేరింది. అసోంలో మరో మూడు కొత్తకేసులతో 16కి పాజిటివ్‌ కేసులు చేరాయి. ప్రస్తుతం కరోనాని ఎలా అరికట్టాలని ప్రధాని నరేంద్ర మెదీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రల్లో కరోనా కట్టడి చేయడానికి మరింత కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.  

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: