ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 9,00,000 దాటింది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి 42,000 మంది మృతి చెందారు. రోజురోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇకపోతే ఈ కరోనా వైరస్ కు పేద, ధనిక.. చిన్న, పెద్ద.. అడా.. మగ అని తేడాలు ఏం ఉండవు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువగా ఈ వైరస్ భారీన పడే అవకాశం ఉంది.

 

ఇకపోతే ఈ కరోనా వైరస్ సెలబ్రిటీలను కూడా వదల్లేదు. మన దేశంలో సింగర్ కనికా కపూర్ కు కరోనా వైరస్ సోకింది.. హాలీవుడ్‌లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కరోనా భారీన పడ్డారు. అంతేకాదు ఓ హీరోయిన్ తండ్రి ఈ మధ్యే కరోనా సోకి చనిపోయాడు. హాలీవుడ్‌లో మార్క్ బ్లమ్ అనే నటుడుతో పాటు ప్రముఖ అమెరికన్ సింగర్ జోయో డిస్ఫీ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

 

తాజాగా ఈ వైరస్ కారణంగా స్టార్ వార్ ఫేమ్ ఆండ్రూ జాక్ రెండు రోజుల క్రితం మృతి చెందారు. ఈ వైరస్ సెలబ్రిటీలతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా వదల్లేదు. ప్రధానమంత్రికి.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి కూడా కరోనా వైరస్ వ్యాపించింది. అయితే మన ప్రధానమంత్రికి కాదు... బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ కరోనా వైరస్ ని నియంత్రించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది తప్ప తగ్గటం లేదు.

 

అలాంటి ఈ కరోనా వైరస్ ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ఈ కరోనా వైరస్ ను నియంత్రించాలి అని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్ నియంత్రించాలి అంటే కేవలం ప్రభుత్వమే కాదు.. ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలను .. సూచనలను ప్రజలు కూడా పాటించాలి. అప్పుడే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశంలో పూర్తి స్థాయిలో నివారించడం సాధ్యమవుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: