కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా అన్ని రంగాలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుండడంతో ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతోంది. ఒకవేళ ముందుగా ఊహించినట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మంద్య ఏర్పడితే కనుక మొదటగా ఎవరు నష్టపోతారు అనే ప్రశ్న తలెత్తినపుడు అందరి చూపు బ్యాంకుల మీద పడుతుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను నడిపించేది బ్యాంకు ఇచ్చే రుణాలపైనే. ప్రతి ఒక్కరూ తమ వ్యాపార లావాదేవీలను బ్యాంకుల ద్వారానే చేస్తూ ఉంటారు. ఏదైనా కంపెనీ మొదలుపెట్టిన, బ్యాంకు లోన్ ద్వారానే చేస్తూ ఉంటారు తప్ప సొంతంగా డబ్బు పెట్టి వ్యాపారాలు చేయరు. బ్యాంకుల ద్వారానే అన్ని వ్యవహారాలు సాగుతూ ఉంటాయి. అయితే ఆ దెబ్బకు ఆర్థిక మాంద్యం కారణంగా వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానులు, బ్యాంకులకు అప్పులు తిరిగి చెల్లించకపోతే ఆటోమేటిక్ గా బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి కి వస్తాయి. దీనిని బట్టి చూస్తే బ్యాంకుల భవిష్యత్తు ఇప్పుడు గందరగోళంలో పడే అవకాశం లేకపోలేదు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

IHG

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. మరో 14 రోజుల పాటు ఏ వ్యాపార సంస్థ నడిచే పరిస్థితి లేకపోవడంతో వ్యాపార సంస్థలన్నీ నష్టాల్లోకి వెళ్లిపోతాయి. తాము తీసుకున్న రుణాలను, వాయిదాలను  చెల్లించడానికి అవసరమైన నగదును కూడా సమకూర్చుకోవాలని పరిస్థితికి వెళ్లిపోతాయి.ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల్లో లిస్ట్ అయిన నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద తీసుకున్న రుణాలు, రూ. 15 లక్షల కోట్ల పైమాటే.ఇప్పుడు ఈ కంపెనీల వ్యాపారాలన్నీ లాక్ డౌన్ అయిపోయాయి. 


నిబంధనలు ప్రకారం ఈ కంపెనీలు తాము తీసుకున్న రుణాలకు సంబంధించి మూడు నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే నిరర్ధక ఆస్తులుగా మారిపోతాయి.అయితే ఈ రుణాలపై ఆర్బీఐ మారటోరియం విధించడంతో కంపెనీలకు కాస్త ఊరటగానే ఉంటుంది. కానీ కంపెనీ నుంచి రావాల్సిన రుణాలు మొత్తం వడ్డీ 35 వేల కోట్లు మూడు నెలల్లో బ్యాంకులకు రాకుండా ఆగిపోతాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ కరోనా ఎఫెక్ట్ కారణంగా ముందుగా ప్రభావానికి గురయ్యేది బ్యాంకులే. మరి బ్యాంకులకు ఏర్పడబోతున్న కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: