కరోనా మహమ్మారి విజృంభించంకుడా ఉండేందుకు అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో నేడు కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కేసీఆర్, జగన్ తో ఎం మాట్లాడారు అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. 

 

మోదీతో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ పలు విషయాలను సీఎం జగన్ అయన దృష్టికి తీసుకెళ్లారు. కరోనా నివారణకై రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను, గడిచిన రెండు మూడు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి కారణాలు ఏంటి అనేది ప్రధాని మోదీకి పూర్తిగా వివరించారు. 

 

కాగా ఆంధ్రలో నమోదైన 111 కేసుల్లో జమాత్ కు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువ ఉంది అని, బయట నుండి వచ్చిన వారిని క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వారికీ వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు.. అలాగే కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బ తినింది అని.. రాష్ట్రానికి తగిన విధంగా ఆదుకోవాలి అని సీఎం జగన్ మోదీని కోరారు. 

 

ఇంకా సీఎం కేసీఆర్ కూడా ప్రధాని తో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాడు. అయితే అయన కూడా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కారణం జమాత్ ఏ కారణం అని.. లాక్ డౌన్ ఉల్లఘించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు అయన చెప్పారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలి అని ప్రధానిని కోరినట్టు సమాచారం.  కాగా ఏపీలో 132 కరోనా పాజిటివ్ కాసులు నమోదు కాగా తెలంగాణాలో 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 


 
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: