ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గంట గంటకు పెరుగుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. గంట గంట కు కరోనా రెచ్చిపోతుంది గాని ఎక్కడా అదుపు అయ్యే పరిస్థితి కనపడటం లేదు. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మని, దక్షిణ కొరియా, స్పెయిన్ ఇలా అన్ని దేశాలకు ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఎంత మంది ఈ వ్యాధి బారిన పడతారో... ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో అర్ధం కావడం లేదు. 

 

దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 949,750 మందికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకింది. అంటే ఈ లెక్కన చూస్తే రేపు ఈ సమయానికి పది లక్షలకు చేరువలో కరోనా బాధితులు ఉండే అవకాశం ఉంటుంది. 48,259 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు ప్రపంచ వ్యాప్తంగా. ఈ లెక్క చూస్తే 50 వేలకు ఈ సంఖ్య ఈ రోజే చేరే అవకాశం ఉంది. 200,317 మందికి కరోనా వైరస్ నుంచి బయటపడ్డారు. 

 

భారత్ లో గత 12 గంటల్లో 130 కొత్త కేసులు బయటపడ్డాయి. 50 మంది మన దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ లో కరోనా కారణంగా దాదాపు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఆరు వేలకు చేరువలో కరోనా మరణాలు ఉన్నాయి. ఇక స్పెయిన్ లో పది వేలకు చేరువలో ఉన్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. రెండు వేలు దాటాయి. ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: