కరోనా..కరోనా..కరోనా.. ఎక్కడ చుసిన ఇ మాట తప్ప ఏమి వినపదం లేదు.  ప్రస్తుతానికి ప్రపంచంలో తొమ్మిది లక్షల మంది దీని బారిన పడ్డారు. ఇందులో లక్షన్నర మంది కోలుకున్నారు. అలాగే దీని బారిన పడి సుమారు 40  వేలకు పైగా మృత్యు వాత పడ్డారు. దీనితో ప్రపంచం మొత్తం దీని దెబ్బకు అతలాకుతలం అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ... మన భారత దేశంలోరోజు రోజుకి కరోనా వైరస్ సోకినా వారి సంఖ్య బాగా పెరిగి పోతుంది. 

 


అలాగే రోగులకు వైద్య సేవలు చేసే డాక్టర్లను సైతం ఈ మహమ్మారి కనికరాణించడం లేదు. ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెసిడెంట్ డాక్టర్ ఒకరు కోవిడ్ 19 బారిన పడ్డాడు. కానీ ఆ  డాక్టర్ కు కరోనా ఎలా వ్యాపించిందో అసలు అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. ఇలా ఢిల్లీలో ఇప్పటి వరుకు  కరోనా బారిన పడిన ఏడో డాక్టర్ కావడం ప్రస్నార్ధకమైన ప్రశ్న. ఇక డాక్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో  హాస్పిటల్‌లో జాయిన్ చేయడం జరిగింది. అలాగే దీనితో పాటు డాక్టర్ కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఎయిమ్స్ అధికారులు తెలియచేయడం జరిగింది.

 

 

ఇక మరో వైవు ఢిల్లీలో మొహల్లా క్లీనిక్‌లో విధులు నిర్వహించే  ఓ డాక్టర్ సైతం కరోనా బారిన పడిన సంగతి  అందరికి తెలిసిన విషయమే. ఇలా జరగడంతో ఆ క్లీనిక్‌ను మూసివేయడంతో పాటు.. ఆ డాక్టర్‌తో కాంటాక్ట్ అయిన పేషెంట్లను క్వారంటైన్లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక చివరికి ఓ పేషెంట్ ద్వారా ఆయనకు కోవిడ్ సోకినట్లు తేలడం జరిగింది. అంతే కాకుండా నేడే ఢిల్లీ సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో పని చేసే ఇద్దరు డాక్టర్లకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. 

 

 

ఇక మన హైదరాబాద్‌లోనూ కూడా  ఇద్దరు డాక్టర్లు కరోనా బారిన పడిన సంగతి కూడా ఇటీవల నిర్దారణ అవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా  దోమలగూడకు చెందిన వీరిద్దరూ దంపతులు అని కూడా తెలిపారు డాక్టర్లు. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలు మించగా.. 60 మంది  వైరస్ బారిన పడి మృత్యు వాత పడ్డారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: