భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మెన్‌, మాజీ ఓపెనర్ గౌత‌మ్ గంభీర్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో బ‌య‌ట కూడా అంతే దూకుడుగా ఉంటాడు. గంభీర్ మైదానంలో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాళ్లు క‌వ్విస్తే అంతే దూకుడుగా ఆన్స‌ర్ ఇస్తాడు. ఇక 2011లో భార‌త జ‌ట్టు చాలా యేళ్ల త‌ర్వాత ప్ర‌పంచ‌క‌ప్ గెలుచుకోవ‌డంలో ఎంత కీల‌క పాత్ర పోషించాడో.. ఎంత ప్ర‌త్యేక‌మైన ఇన్నింగ్స్ ఆడాడో తెలిసిందే. ఇక రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గంబీర్ గ‌తేడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచి త‌క్కువ వ‌య‌స్సులోనే లోక్‌స‌భ‌లో అడుగుపెట్టాడు.

 

ఇక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెరిగిపోతోన్న క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా త‌న ఉదార‌త చాటుకున్నాడు. తాను ఎంపీగా ఉన్నందున త‌న‌కు  నెలా నెలా వ‌చ్చే జీతంలో రెండేళ్ల జీతాన్ని గంబీర్ ప్రధానమంత్రి సహాయనిధి(పీఎం-కేర్స్)కు విరాళంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని గంభీర్ సోష‌ల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఇక్క‌డే గంబీర్ ఇచ్చిన మెసేజ్ కూడా అంద‌రిని ఆక‌ట్టుకుంది. మ‌న‌కు దేశం ఏం చేసింది ? అన్న‌ది కాదు... మ‌నం దేశానికి ఏం చేశామ‌న్న‌దే నిజ‌మైన ప్ర‌శ్న అని.. క‌రోనాపై పోరాటం నేప‌థ్యంలో నా రెండు సంవ‌త్స‌రాల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

 

అంతకు ముందు ఎంపీల స్థానిక సంస్థల అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయిలను విడుదల చేసి.. కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వానికి అందిస్తున్నట్లు గంభీర్ ప్రకటించాడు. ఇక ఇప్పటికే ప‌లువురు క్రీడాకారులు సైతం ఈ వైర‌స్‌పై పోరాటానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో పాటు భారీగా విరాళాలు ఇచ్చారు. ఇక గంబీర్ అటు క్రికెట‌ర్‌గానే కాకుండా ఇటు ఎంపీగా ఉన్నందున వ‌చ్చే రెండేళ్ల విరాళం ఇవ్వడంతో అత‌డిపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. గంబీర్‌ను అటు క్రికెట‌ర్లు.. ఇటు రాజ‌కీయ నాయ‌కులు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: