ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఓ మ‌త‌స్తులు నిర్వ‌హించిన ప్రార్థ‌నల కార‌ణంగా క‌రోనా వైర‌స్ వ్యాధిగ్ర‌స్తులు పెరుగుతున్నార‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డే వ‌ర‌కు నలభై, యాభైగా ఉన్న కేసులు ‘ఢిల్లీ మర్కజ్’ ఘటనతో ఒక్క‌సారిగా రెట్టింపు అయ్యాయి. మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ స‌భ్యులు, సన్నిహితుల్లో ఎక్కువ మందికి వైరస్ సోకినట్లు బయటపడుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.అయితే, స‌రిగ్గా ఇలాంటి మ‌త ప్రార్థ‌న‌లే మ‌రో దేశంలో క‌ల‌కలంగా మారాయి. ఫ్రాన్స్​లోని మల్హౌస్ సిటీలో జరిగిన ఒక మత సమ్మేళనం ఇప్పుడు 2,500 కరోనా కేసులకు కారణమైనట్లు తేలింది.

 


‘ఓపెన్ డోర్ చర్చ్’ పేరుతో ప్రాన్స్‌లోని మల్హౌస్ సిటీలోని ఒక చర్చిలో వేడుకలు నిర్వహించారు. దీనికి ఫ్రాన్స్ దేశస్తులే  కాకుండా బూర్కినా ఫాసో, గుయానా, స్విట్జర్లాండ్, కార్సికా నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఫిబ్రవరి 18 నుంచి వారం రోజులపాటు గిన ఈ మ‌త స‌మ్మేళ‌నాని నాలుగు దేశాల నుంచి రోజూ కనీసం 2000 మంది వరకు పాల్గొన్నట్లు అంచనా. చర్చికి సంబంధించి 17 మందికి కొవిడ్–19 సోకినట్లుగా గుర్తించారు.  ఈ పరీక్షల్లో ఫ్రెంచ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉద్యోగినికి, కార్సికా ఐలాండ్​కి చెందిన 70 ఏళ్ల మహిళకు,  బూర్కినా ఫాసో క్యాపిటల్ సిటీ ఓగడౌగౌలోని చర్చి పాస్టర్ మమడౌ కరంబిరికి కరోనా పాజిటివ్ అని తేలింది.ఒకే ఫ్యామిలీలోని 10 మందికి కూడా కరోనా సోకిందని గుర్తించారు. దీంతో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారినందరినీ జల్లెడ పట్టే పనిలో పడ్డారు.

 

కాగా, తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరికీ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నది. మర్కజ్ కు వెళ్లివచ్చిన మరో 300 మందికి టెస్టులు చేయాల్సి ఉంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: