అతి సూక్ష్మమైన కరోనా మహమ్మారి కొవిడ్ 19 ముందు... అతి పెద్దదైన ప్రపంచం మోకరిల్లక తప్పట్లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్న కొవిడ్ కేసులు ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదేమో. ప్రస్తుత లెక్కలను బట్టి చుస్తే.. నిమిషానికి 50 కరోనా పాజిటివ్ కేసులు... మరణాలు.. గంటకు 30 దాకా నమోదు అవుతున్నట్లుగా.. WHO ప్రకటించడం గమనార్హం.

 

ప్రస్తుతం అందిన సమాచారం మేరకు... వివిధ దేశాల్లో వరుసగా... దక్షిణ కొరియా, కెనడా, పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా,  బ్రెజిల్, స్విట్జర్లాండ్, టర్కీ, బెల్జియం,  స్వీడన్, డెన్మార్క్, రోమేనియా దేశాల్లో... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. ఇక  అమెరికా, స్పెయిన్, ఇటలీ సంగతి గురించి చెప్పనవసరం లేదు. అక్కడ పెరిగి పోతున్న చావులు చూస్తుంటే శత్రు దేశాలకైనా జాలి కలగక మానదు.

 

విశ్వవ్యాప్తంగా చూసుకుంటే... నమోదైన కేసులతో పోల్చుకుంటే, మరణాలరేటు 20 % ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 80 % కేసులు రికవరీ అయినట్లు తెలుస్తోంది... మరణ శాతాన్ని బట్టి పోల్చుకుంటే కొంచెం ఆశాజనకంగా కనిపించినప్పటికీ.. ప్రతి వారానికి పెరిగిన మరణాల శాతాన్ని బట్టి చుస్తే... మనం డేంజర్ జోన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది... ప్రస్తుత బాధితులు... మరణాల సంఖ్యను పరిశీలించినట్లయితే...

 

ప్రపంచలో మొత్తం కేసులు: 9, 50, 430
మరణాలు: 48, 276
రికవరీ కేసులు: 2, 02, 627

 

ఇండియాలో మొత్తం కేసులు: 2032 
మరణాలు: 58 
కొత్త కేసులు: 34
రికవరీ కేసులు: 148 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 127
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 9 
ఏపీలో మొత్తం కేసులు: 132
మృతులు: 0

 

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
గుంటూరు: 20
నెల్లూరు: 20
ప్రకాశం: 17 
కృష్ణా: 15
కడప: 15 
పశ్చిమ గోదావరి: 14
విశాఖపట్నం: 11
తూర్పు గోదావరి: 9 
చిత్తూరు: 8 
అనంతపురం: 2 
కర్నూలు: 1 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: