గడచిన 24 గంటల్లో భారతదేశంలో 368 కొత్త కరోనా కేసులు నమోదు అయినప్పటికీ... ఇతర దేశాల్లో లాగా మరణాల సంఖ్య మాత్రం ఒకేసారి అకస్మాత్తుగా ఏనాడు పెరగలేదు. ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాలలో ఒక్కరోజే వందల సంఖ్యలో కరోనా మరణాలు సంభవించినట్లు... మనదేశంలో కరోనా మరణాలు సంభవించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య దాదాపు పది లక్షలు సంఖ్యకి చేరుతుండగా... 47, 500 కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. ఇటలీ లో 13వేల మంది చనిపోగా... 24 గంటల్లో 754 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 110, 774 కి చేరుకుంది. స్పెయిన్ లో కూడా అత్యధికంగా 9వేల కోవిడ్ 19 మరణాలు సంభవించాయి.


అయితే చాలామంది... ఒకవేళ భారతదేశంలో అందరికీ కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తే... అమెరికా, ఇటలీ దేశాల్లో లాగా లక్షకి పైగా కరోనా పాజిటివ్ కేసులను బయట పడతాయని అభిప్రాయపడుతున్నారు. వైద్య శాస్త్రవేత్తలు మాత్రం ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య నిజంగానే చాలా తక్కువగా ఉందని... ఒకవేళ ఎక్కువగా ఉంటే ఇప్పటికే లక్షల సంఖ్యలో కరోనా పీడితులు ఆసుపత్రిలలో అడ్మిట్ అయ్యి ఉండేవారని అంటున్నారు. కరోనా మరణాల సంఖ్య కూడా వేల సంఖ్యలో ఉంటుందని చెబుతున్నారు. నిజమేమిటంటే... కరోనా బారిన పడిన వారి సంఖ్య దాయవచ్చు... కానీ కరోనా వలన చనిపోయిన వారి సంఖ్య దాయటం అసాధ్యం.


సోకినవారు ఒకవేళ ఇళ్లల్లో కొంతకాలం దాచుకున్నా... కొద్దిరోజుల తర్వాత వాళ్ళ పరిస్థితి విషమం అవుతుంది... అప్పుడు వాళ్ళు కచ్చితంగా ఏదోవొక ఆసుపత్రిని సంప్రదిస్తారు. ఆ సందర్భంలో కొత్త కరోనా కేసుల సంఖ్య బయట పడక తప్పదు. కానీ కరోనా ఇండియాలో అడుగు పెట్టి నెల రోజులు అవుతున్నప్పటికీ అటువంటి కొత్త కేసులు అత్యధిక సంఖ్యల్లో అనగా వేలల్లో నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తుంటే అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల వేగంగా లేదని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేస్తున్నామని ప్రకటించినట్టు కూడా సమాచారం అందుతుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: