దేశంలో కరోనా రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  రోడ్లపై నిత్యావసర షాపులకు మాత్రమే పరిమిషన్ ఇచ్చారు.  జనాలు కూడా రోడ్డెక్కడానికి భయపడిపోతున్నారు.  ఇలాంటి సమయంలో ఆటోవాలలు ఇంటి పట్టునే ఉండిపోతున్నారు.  ఈ సమయంలో వారికి ఆదుకునేందుకు మంత్రి హరీష్ రావు తన పెద్ద మనసుతో ముందుకు వచ్చారు.   కరోనా ప్రభావంతో దినం గడిస్తేనే తినడానికి సరుకులు తెచ్చుకునే సిద్ధిపేట ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు.

 

గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో దినం కష్టపడితేనే పూట గడవని ఆటోవాలాలను ఆదుకునేందుకు మంత్రి హరీశ్ ముందుకొచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎక్స్ ప్రెస్ బస్ స్టాoడ్ ఆవరణలో 700 మంది ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సీఏం కేసీఆర్ 12కిలోల బియ్యం అందిస్తున్న దరిమిలా వారికి ఉప్పు, పప్పులు, చింత పండు తదితర రూ.1250 విలువ కలిగిన నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. 

 

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉందని.. ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఇంటి పట్టున ఉండాలని ఆయన ఈ సందర్భంగా అందరినీ కోరారు.  లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: