క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలుతుంటే మ‌రోవైపు ఉద్యోగాలు సైతం హుష్ కాకి అవుతున్నాయి. 1929లో వ‌చ్చిన ఆర్థిక‌మాంద్యం... 1945లో వ‌చ్చిన రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఇంకా చెప్పాలంటే ఈ రెండు సంఘ‌ట‌న‌ల కంటే కూడా ఇప్పుడు క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంద‌ని అంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా దెబ్బ‌తో ప్రైవేటు సంస్థ‌ల్లో కొన్ని ల‌క్ష‌ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. వ‌ర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు ఉన్న చోట వీళ్ల‌ను కంటిన్యూ చేస్తుండ‌గా.. త‌ప్ప‌నిస‌రిగా ఆఫీస్‌కు వెల్లే ఉద్యోగాలు చాలా ఊడిపోతున్నాయి.

 

ఈ క్ర‌మంలోనే బ్రిట‌న్‌లో కొన్ని ల‌క్ష‌లు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇప్ప‌టికే ఉద్యోగుల‌ను ఎలా తొల‌గించుకోవాలా ? అని వెయిట్ చేస్తోన్న ప‌లు ప్రైవేటు సంస్థ‌ల‌కు ఈ క‌రోనా ఎఫెక్ట్ పెద్ద వ‌రంలా మారింది. బ్రిట‌న్ లో ప‌లు ప‌రిశ్ర‌మ‌లు మూత ప‌డ‌డంతో పాటు సుదీర్ఘ‌కాలం లాక్ డౌన్ ప్ర‌క‌టించే ఛాన్సులు ఉండ‌డంతో బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థ 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. 36 వేల మంది ఉద్యోగులంటే మొత్తంగా 80 శాతం మంది ఉద్యోగులపై పిడుగు పడిననున్నట్టు తెలుస్తోంది. 

 

ఇదిలా ఉండగా.. యునైట్ యూనియన్‌తో చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. ఇక ఇప్ప‌టికే ప‌లు దేశాలు విమానాల జ‌ర్నీల‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు అన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులు మూసివేశాయి. దీంతో వ‌చ్చే కొన్నేళ్ల‌లో ఈ రంగంలో తీవ్ర సంక్షోభం త‌ప్ప‌ద‌నే అంటున్నారు. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారి జీవితాలు తీవ్ర దుర్బ‌రం కానున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: