అమెరికా, స్పెయిన్, ఇటలీ... ఇప్పుడు ఈ మూడు దేశాల పరిస్థితి చాలా వరకు దారుణంగా ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో కరోనా వైరస్ విస్తరించింది. అమెరికాలో అయితే అక్కడి ప్రభుత్వం కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి నానా విధాలుగా కష్టపడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది కట్టడి అవ్వడం లేదు అమెరికాలో. ఉన్న కొద్దీ రెచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇటలీలో మృతుల సంఖ్య 14 వేలకు చేరువలో ఉంది. అమెరికాలో 5 వేలు దాటింది. స్పెయిన్ లో పది వేలకు దగ్గరలో మృతుల సంఖ్య ఉంది. 

 

ఈ సంఖ్య రాను రాను పెరిగే అవకాశం ఉండటమే గాని ఎక్కడా కూడా తగ్గే సూచనలు మాత్రం దాదాపుగా లేవు అనే చెప్పాలి. కరోనా అక్కడ ఒక రకంగా మృత్యు క్రీడ ఆడుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉంది. ఇక అమెరికాలో అయితే బుధవారం ఒక్క రోజే దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మరణాలు మరింత ఆందోళన గా ఉన్నాయి. అక్కడ యువకులు ఎక్కువగా చనిపోయే పరిస్థితి ఉంది అనే విషయం అర్ధమవుతుంది. అక్కడ ఎక్కువగా చనిపోయింది యువకులే. 

 

దీనితో అక్కడ ఆస్పత్రులు వారి విషయ౦లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. పరిస్థితి మరింత దిగాజారక ముందే వ్రుద్దులను పక్కన పెట్టి యువకులకు చికిత్స చేసే ఆలోచనలో అమెరికా ఉంది అనేది అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు ఇటలీ లో అయితే వ్రుద్దులను అసలు ఆస్పత్రుల్లో కూడా చేర్చుకునే పరిస్థితి లేదు. అక్కడ రోజు రోజు కి శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. రోమ్ నగరంలో మరీ దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. చాలా మంది ప్రజలు కరోనా ఉందని తెలిస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: