క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ప్ర‌పంచ‌మే లాక్ డౌన్ పాటిస్తోంది. ప్ర‌పంచంలో ఎన్నో దేశాలు ఇప్ప‌టికే లాక్ డౌన్ విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సైతం ముందుగా జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించ‌డంతో పాటు ఆ త‌ర్వాత ఏకంగా మూడు వారాల పాటు లాక్ డౌన్ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ రాష్ట్రాల సీఎంల‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని టాక్‌. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 1965 పాజిటివ్ కేసులు వ‌చ్చిన‌ట్టు చెప్పారు.

 

ఏప్రిల్ 14 నుంచి ద‌శ‌ల వారీగా లాక్ డౌన్ ఎత్తివేత త‌ర్వాత ఏం చేయాల‌నేదానిపై సైతం మోదీ సీఎంల‌తో మాట్లాడారు. ఒకేసారి జ‌నాలు రోడ్ల‌మీద‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించ‌డంతో పాటు ప్ర‌ధాని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప‌లు అంశాలు ప్ర‌స్తావ‌న‌కు తెచ్చారు. లాక్‌డౌన్ ఎత్తివేత త‌ర్వాత తీసుకోవాల్సిన అంశాల‌పై చ‌ర్చ‌లు ? లాక్‌డౌన్ త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు వ‌స్తాయి ?  వాటిని ఎలా ఎదుర్కోవాలో చ‌ర్చించారు. ఇక లాక్ డౌన్ ఎత్తివేశాక ఏం చేయాలో ఇప్ప‌టి నుంచే రోడ్ మ్యాప్ త‌యారు చేయాల‌ని మోదీ ముఖ్య‌మంత్రుల‌కు సూచ‌న చేశారు. ఇక దేశంలో 24 గంట‌ల్లో 328 పాజిటివ్ కేసులు రాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 50 మంది మృతి చెందారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: