కరోనా వైరస్.. రోజు రోజుకు పెరిగిపోతుంది. నిజం చెప్పాలి అంటే శృతి మించుతుంది. ఈ కరోనా వైరస్ ను అదుపు చెయ్యాలి అని కేంద్రం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే మూడు రోజుల ముందు వరుకు మన దేశంలో కరోనా వైరస్ అదుపులో ఉంది అని అనుకుంటే ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్ భవన్‌లో జరిగిన మత ప్రార్థనల కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి అమాంతం పెరిగింది. 

 

ఇంకా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ మండలి హాట్‌స్పాట్‌లలో ప్రజలకు రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్‌లు నిర్వహించాలని  ఆదేశించింది. దీంతో హాట్‌స్పాట్‌లుగా ఉన్న ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించింది. అయితే ఈ పరీక్షలు గొంతు, ముక్కు రంధ్రాల వద్ద నుండి నిర్వహిస్తారు. 

 

అలా నిర్వహించిన పరీక్షలో పాజిటివ్ వస్తే చికిత్సకు ఆస్పత్రులకు పంపుతారు అని.. లేకుంటే నెగిటివ్ వస్తే వారు ఇంటికి పరిమితం అవుతారు అని ఐసీఎంఆర్ మధ్యంతర సూచనలు జారీ చేసింది. ఇలా హాట్‌స్పాట్‌లుగా ఉన్న ప్రాంతాల్లో ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్ట్‌లు నిర్వహిస్తారు. కాగా మన భారత్ లో కరోనా వైరస్ బారిన 2వేలమందికిపైగా పడ్డారు. అందులో 62మంది మృతి చెందారు. 

 

ఇంకా ప్రపంచవ్యాప్తంగా 9లక్షల 50 వేలమంది ఈ కరోనా బారిన పడి ప్రాణాల కోసం కరోనాతో పోరాడుతున్నారు.. అందులో 48వేలమంది కరొనాతో పోరాడి ఓడిపోయి మృత్యువాత పడ్డారు. ఇలా రోజు రోజుకు కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. దీని నివారించలేక అగ్ర రాజ్యాలు సైతం తల పట్టుకుంటున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: