దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో పాలసీ దారులకు ఆర్థికమంత్రిత్వ శాఖ శుభవార్త తెలియచేసింది. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మోటారు, ఆరోగ్య బీమా చెల్లుబాటును ఏప్రిల్ 21 వరకు గడువు తేదీని పొడికిస్తున్నట్లు తెలియ చేసింది.  ఇందుకు ముఖ్య కారణం ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఈ బీమా చెల్లింపుల పునరుద్ధరణ తేదీలు వచ్చే వ్యక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో అందరికి అర్థం అవుతుంది.  

 


ఇలా చేయడంతో  2020 మార్చి 25 - ఏప్రిల్ 14 (లాక్ డౌన్ సమయం) మధ్యకాలంలో  చెల్లింపులు చెల్లిచవలసిన వారికి వాహన, ఆరోగ్య పాలసీ దారులకు భారీ ఉపశమనం వస్తుందని అని బాగా అర్థం అవుతుంది. వాస్తవానికి ఈ ఉత్తర్వు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే దీనితో పాటు పాలసీ దారులు ప్రీమియం బకాయిలు మొత్తాన్ని కూడా ఏప్రిల్ 21 న లేదా అంతకన్నా ముందుగానీ చెల్లించవచ్చని మంత్రిత్వ శాఖ తెలియ చేయడం జరిగింది. 

 

 


నిజానికి కరోనా  నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా వారి పునరుద్ధరణ ప్రీమియాన్ని సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ఈ తరుణంలో దేశంలో చట్టబద్ధమైన మోటారు వాహనం థర్డ్ పార్టీ భీమా కవరేజీని కొనసాగించాలని తెలిపింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. అలాగే ఏప్రిల్ 21, 2020 ని పాలసీ పునరుద్ధరణ  తేదీగా మార్చాలని తెలియ చేసింది. అంతే కాకుండా ఆరోగ్య బీమా పాలసీ కూడా అమల్లోకి వస్తుంది అని  పాలసీ దారులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏది ఏమైనా భారత ప్రభుత్వం భారతీయులకి కరోనా కారణంగా అనేక ప్యాయోజనాలను ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం పిలుపును ఇవ్వడం ప్రతి భారతీయుడి కర్తవ్యం. కాబట్టి అందరూ లాక్ డౌన్ సహకరిస్తూ వారివారి ఇళ్లల్లో ఉండి ప్రభుత్వానికి సహకరిస్తే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: