జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి పది నెలలు అయింది. ఈ పది నెలలూ ఏ సీఎంకి రానన్ని కష్టాలు జగనే వచ్చాయి. నిజంగా జగన్ అధికార‌ వైభోగంలో హానీమూన్ అన్న సీన్ లేనే లేదు. ఇక జగన్ గద్దెనెక్కాక కనీసం  కొంత టైం అయినా ఇవ్వకుండా విపక్షాలు అన్నీ కలసి ఒక్కసారిగా అటాక్ చేస్తూవచ్చాయి. ఆఖరుకు కరోనాను సైతం రాజకీయానికి వదలడంలేదు.

 

జగన్ తీరు చూసుకుంటే ఆయన పైకి నిమ్మళంగా ఉన్నా సరే రేపటి రోజు ఎలా అన్న  భయంతో  ఉన్నారని అంటున్నారు. జగన్ తన హామీలను నెరవేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నదంతా గుమ్మరించి ప్రజలకు ఇచ్చేశారు. వివిధ పధకాలకు డబ్బు ఖజానా నుంచి తెచ్చివ్వడంతో ఖజానా ఖాళీ అయింది. ఇపుడు చూస్తే కరోనా ఎఫెక్ట్ తో ఏపీ టోటల్ గా  లాక్ డౌన్ అయింది.

 

ఏపీలో అంతా ఇంట్లోనే గడుపుతున్నారు. అన్నీ ఆగిపోయాయి. దాంతో రాష్ట్ర ఖజానకు రూపాయి కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైతే ఉద్యోగుల జీతాలను పెండింగులో పెట్టారు. కరోనా వైరస్ ఎపుడు కట్టడి అవుతుందో, ఎపుడు లాక్ డౌన్ ఆగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

 

ఈ నేపధ్యంలో కరోనా కట్టడికి మరో వైపు విపరీతంగా ఖర్చు చేయాలి. దాంతో ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. విరాళాలు కూడా ఏపీకి పెద్దగా రావడంలేదు. దాంతో జగన్ బిగ్ ట్రబుల్స్ లో పడ్డారని అంటున్నారు. ఈ కారణంగానే అంతా కరోనా వైరస్ గురించి మాట్లాడితే ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ ఏపీ ఆర్ధిక ఇబ్బందుల గురించి చెప్పుకోవాల్సివచ్చింది.

 

ఏపీ ఖజానా ఖాళీగా వెక్కిరిస్తోంది. ఈ సమయంలో కేంద్రం ఆదుకోవాలని జగన్ గట్టిగానే కోరారు. ఆ సమావేశంలో ఇద్దరు ఉద్దండులైన కేంద్ర పెద్దలు మోడీ, అమిత్ షా ఉన్నారు. మరి వారు ఏపీ గురించి సానుకూలంగా రియాక్ట్ అవుతారా. లేకపోతే జగన్ కి పూర్తిగా చిక్కులు తప్పవు. ట్రబుల్స్ నుంచి ట్రబుల్స్ కి జగన్ ప్రయాణం చేయాల్సిఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: