కరోనా వైరస్ దెబ్బకు ప్రస్తుతం ప్రపంచంలో రోగుల సంఖ్య.. క్రికెట్ మైదానములో పరుగెడుతున్న స్కోర్ ను తలపించక మానదు. ఇక మరణాల సంఖ్యను, పడగొట్టిన వికెట్లతో పోల్చవచ్చు.. కరోనా బారినుండి తప్పించుకున్నవారిని రన్ అవుట్ నుండి తప్పించుకున్న మిస్సింగ్ వికెట్ తో సరిపోల్చవచ్చు... ఏది ఏమైనా ప్రస్తుత దుస్థితి, కలలో కూడా ఎవరూ ఊహించి వుండరు.

 

ఒక సర్కిల్ లో పరుగెడుతున్న ప్రపంచాన్ని కరోనా ఒక్క దెబ్బకు కూర్చో బెట్టింది. వర్మ అన్నట్లు కంటికి కనిపించని ఒక చిన్న పురుగు... ప్రపంచంలో వున్న 700 కోట్ల మంది జనాభాను ముప్పు తిప్పలు పెడుతోంది అందంలో ఆశ్చర్యం లేదు. పలువురు విశ్లేషకులు, నిపుణులు అన్నట్లు.... ఎవరో చేసిన పాపానికి మరెవరో మూల్యం చెల్లించినట్లవుతుంది. కరోనా వైరస్ విజ్రంభన ఇపుడు విశ్వ మానవాళికి ఒక శాపంలా మారింది.

 

మొదట్లో.. ఒక్క దేశానికే పరిమితమైన ఈ పురుగు, క్రమ క్రమంగా.. ఒక్కో దేశానికి విస్తరించడం మనం చూస్తూనే వున్నాం... ఇక ప్రస్తుతానికి ఆ సంఖ్య.. 200 దేశాలను పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకు.. 50,000 మంది ప్రాణాలను తీసిన ఈ మహమ్మారి కరోనా...  10 లక్షలకు అతి చేరువలో వుంది... ప్రస్తుత బాధితులు, మరణాల సంఖ్యను గమనించినట్లయితే.... ఈ విధంగా వున్నాయి.

 

ప్రపంచలో మొత్తం కేసులు: 9, 54, 468
మరణాలు: 48, 558
రికవరీ కేసులు: 2, 02, 941

 

ఇండియాలో మొత్తం కేసులు: 2032 
మరణాలు: 58 
కొత్త కేసులు: 34
రికవరీ కేసులు: 148 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 133
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 9 
ఏపీలో మొత్తం కేసులు: 135
మృతులు: 0

 

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
గుంటూరు: 20
నెల్లూరు: 20
ప్రకాశం: 17 
కృష్ణా: 15
కడప: 15 
పశ్చిమ గోదావరి: 14
విశాఖపట్నం: 11
తూర్పు గోదావరి: 9 
చిత్తూరు: 8 
అనంతపురం: 2 
కర్నూలు: 1 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: