తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ఆయన ఎక్కువగానే కష్టపడుతూ నిత్యం అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. దీనితో కరోనా వైరస్ తెలంగాణాలో కాస్త అదుపులో ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది పెరిగే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీనితో కెసిఆర్ ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే ఆయన అధికారులతో కూడా చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పుడు మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని కెసిఆర్ భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో కరోనా వైరస్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి... ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ ఎత్తేసినా సరే గ్రామాలకు పట్టణ ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలను పూర్తిగా ఆపేసే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారు. గ్రామ స్థాయిలో కరోనా వైరస్ పెరిగితే మాత్రం ఇబ్బందే అనేది అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సిద్ధిపేట సహా అనేక ప్రాంతాల నుంచి పూర్తిగా రవాణా ను రద్దు చెయ్యాలని భావిస్తునారు. 

 

ఇక గ్రామాల్లో కూడా కొన్ని కఠిన ఆంక్షలను అమలు చెయ్యాలని చూస్తున్నారు. ఏ గ్రామానికి చెందిన అధికారి ఆ గ్రామంలోనే ఉండాలి గాని బయటకు రావొద్దని అంటున్నారు. వీఆర్ వో లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్లకు కీలక బాధ్యతలను అప్పగించి వారిని గ్రామాల్లోనే ఉంచాలని కెసిఆర్ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల నుంచి వైద్య అధికారులను గ్రామ స్థాయిలోకి పంపే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచి నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కొందరి నుంచి ఎక్కువగా వినపడుతున్న మాట.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: