దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ కట్టడి అవుతుంది అంటే దానికి కచ్చితంగా ప్రధాన కారణం లాక్ డౌన్ ని అమలు చేయడమే. లాక్ డౌన్ ని ఏ మాత్రం సడలించినా సరే కరోనా వైరస్ రెచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటించి నేటికి 9 రోజులు అవుతుంది. దీన్ని మరింతగా పొడిగిస్తే బాగుంటుంది అని తెలుగు రాష్ట్రాలు భావిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న సంగతి అర్ధమవుతుంది. 

 

ఢిల్లీ నుంచి వచ్చిన వారి నుంచి కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. చాలా మంది ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ కట్టడికి ఇప్పుడు వాళ్ళే అడ్డంగా మారారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు. గ్రామాల్లో కూడా వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోన వైరస్ ని వాళ్ళతో పాటు ఇతరులకు కూడా అంటించే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. దీనితో పరిస్థితులు క్రమంగా ఆందోళన కరంగా మారుతున్నాయి. కరోనా వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కావడం లేదు. 

 

ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ని సదలిస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అనేది ముఖ్యమంత్రుల ఆలోచన గా అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు కేంద్రానికి ఇదే విషయం చెప్పి లాక్ డౌన్ పొడిగించే ప్రయత్నం ముఖ్యమంత్రులు చేస్తున్నారని అంటున్నారు. లాక్ డౌన్ కొనసాగి౦చకపోతే మాత్రం కరోనా వైరస్ అనేది ఇప్పుడు గ్రామ స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది సిఎం ల భయం. అందుకే ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వద్దని వాళ్ళు గట్టిగా పట్టుదలగా ఉన్నారు. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా భారిగా నష్టపోవాలి కాబట్టి లాక్ డౌన్ ని కొనసాగించడం మంచిది అనుకుంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: