కరోనా వైరస్ కట్టడి విషయంలో కొందరు కావాలి అనే ప్రభుత్వానికి సహకరించడం లేదు అనే అనుమానాలు ఇప్పుడు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. కరోనా సోకినా వాళ్లకు మన ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా చికిత్స అందిస్తున్నాయి. అది కూడా ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా సరే చాలా మంది బయటకు రావడం లేదని అంటున్నారు. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళను బయటకు రావాలని సూచిస్తున్నా సరే... వాళ్ళు మాత్రం బయటకు రావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. 

 

కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తేడా జరిగినా సరే పరిస్థితులు ఎవరి ఊహకు అందే విధంగా ఉండవు. ఇక ఇదిలా ఉంటే తాజాగా సికింద్రాబాద్ లో కొందరు ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్ళను గుర్తించారు. వాళ్ళ గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళను పట్టుకోవడానికి వస్తే పోలీసులకు దొరికే ప్రయత్నం చేయకుండా పారిపోయారు. వాళ్ళు ఎందుకు పారిపోవాల్సిన అవసరం వచ్చింది అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఇక ఇది పక్కన పెడితే కొందరిని అధికారులు క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సెంటర్స్ లో వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. 

 

వాళ్ళ ప్రవర్తన చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. తమకు నచ్చిన విధంగా సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంటున్నారు. కలిసి ప్రార్ధన చేయడం, కలిసి భోజనం చేయడమే కాకుండా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన విషయంలో ఇప్పుడు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆరుగురు గురించి సమాచారం దొరికినప్పుడు పోలీసులు వెళ్ళగా అక్కడి నుంచి వాళ్ళు పారిపోగా ఒక వ్యక్తో పోలీసులకు దొరికాడు. ఆ సమయంలో ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్న వాహనాలను పట్టుకున్నట్టు కనపడుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: